మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2024లో స్త్రీ పురుష సమానత్వం కోసం పెట్టుబడిని పెట్టమని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. నినాదాలు ఎంత గొప్పగా ఉన్నా ఆచరణ ఉంటేనే మార్పు వస్తుంది.
సాధారణ మహిళలు సృష్టించిన అసమాన్య చరిత్ర మహిళా దినోత్సవానికి నాంది పలికింది. పారిశ్రామికీకరణ మొదట్లో 19వ శతా» ్దం ఆరంభంలో ఇటలీ, ఇంగ్లాండ్, పోలండ్, రష్యా వంటి వివిధ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చినవారు పరిశ్రమలలో పని చేస్తుండే వారు. కనీస సౌకర్యాలు లేకుండానే అతి తక్కువ వేతనంతో రోజుకు 15 గంటలు పని చేస్తుండేవారు.
యూనియన్ చేసే సమ్మెలలో కూడా మగవారి డిమాండ్లనే పరిష్కరించేవారు. దీనితో 1820ల కాలంలోనే మహిళలు యూనియన్లుగా సంఘటితమవడం మొదలు పెట్టారు. 1857 మార్చి 8న పెద్ద సంఖ్యలో మహిళలు కవాతు చేశారు. పది గంటల పనిదినం, పురుషులతో సమాన హక్కులు, కనీస సౌకర్యా లను డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిని, కిరాయి రౌడీల దౌర్జ న్యాన్ని ఎదుర్కొన్నారు.
1900లో అంతర్జాతీయ మహిళా దుస్తుల శ్రామిక యూనియన్ ఏర్పడి మార్చి 8న మరిన్ని నిరసన ప్రదర్శ నలు జరిగాయి. 1908లో 1857 నాటి మార్చి 8 నిరస నను గుర్తు చేసుకుంటూ... పని గంటల తగ్గింపు, మెరుగైన పని పరిస్థి తులు, సమాన హక్కులతో పాటు చైల్డ్ లేబర్‌ను నిషేధించాలని ప్రదర్శన చేశారు. 1909లో 20వేల మందితో సుదీర్ఘకాలం పాటు సమ్మె చేశారు. సమ్మె పాక్షికంగా విజయం సాధించింది. కానీ చదువు రాని మహిళలు ఏమి చేయలేరని భావనను ఇది సవాలు చేసింది. వారిలో ఆత్మగౌరవాన్నీ, శక్తినీ నింపింది. ఇదే కాలంలో అమెరికా సోషలిస్టుల మద్దతు వీరికి లభించింది.
ఈ పోరాటాలను పరిశీలిస్తూ ఎంతో స్ఫూర్తి పొందిన జర్మన్ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రీకరించాలని 1910లో ‘కోపెన్ హెగెన్’లో జరిగిన రెండవ కాన్ఫరెన్స్‌లో ప్రతిపాదించింది. 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు దీనిని ఏక గ్రీవంగా ఆమోదించారు. అప్పటినుంచి సోషలిస్టు పార్టీ పిలుపు నందుకొని మరిన్ని దేశాలలో మార్చి 8న మహిళా సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి.
1912లో గౌరవప్రదమైన జీవితం కోసం ‘మాకు రొట్టెలే కాదు గులాబీలు కావాలి’ అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని ప్రదర్శన చేశారు. ‘బ్రెడ్ అండ్ రోజెస్‘ పాట మార్చి 8 కవాతు గీతం అయింది. 1917లో రొట్టె, శాంతి కోసం డిమాండ్ చేస్తూ జరిపిన మహిళా దినం రష్యా విప్లవాన్ని ఒక మలుపు తిప్పింది. సోషలిస్టు దేశాలలో మొదటగా ఈ డిమాండ్లను పరిష్కరిస్తూ మార్చి 8న సెలవు దినంగా ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని ‘అంతర్జాతీయ మహిళా దినో త్సవం’గా జరపాలని ప్రకటించింది.
శ్రామిక మహిళలు చేసిన పోరాట ఫలితాలు ఆఫీసుల్లో పనిచేసే కొద్ది మంది మహిళలకే దక్కాయి. రాజకీయ పార్టీలు మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి తర్వాత మరచిపోతున్నాయి. తమ సమస్యలపై ప్రశ్నిస్తూ మార్చి 8 స్ఫూర్తితో పోరాడితేనే మహిళల జీవితాలలో మార్పు వస్తుంది.
– రాధ, చైతన్య మహిళా సంఘం
సాధారణ మహిళలు సృష్టించిన చరిత్ర
Published Fri, Mar 8 2024 1:02 AM | Last Updated on Fri, Mar 8 2024 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment