‘మార్పు నీతోనే మొదలవ్వాలి’ అంటున్నారు హీరోయిన్ సమంత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంత మహిళలను ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ‘‘మన స్థాయి, విలువ ఏంటో తెలుసుకునే తరుణం వచ్చింది. మన అర్హతకు తక్కువగా మనం ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నన్ను నేను మరింత నమ్మాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలెంజ్ చేసుకుంటున్నాను.. మిమ్మల్ని కూడా చేయమని అడుగుతున్నాను. నీలో నుంచే సాధికారిత రావాలి. ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి’’ అని పేర్కొన్నారు సమంత. కాగా ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమంత తమిళంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఆ మార్పు నీతోనే..!
Published Mon, Mar 8 2021 2:24 AM | Last Updated on Mon, Mar 8 2021 2:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment