స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. చివరిగా నిశబ్దం మూవీతో పలకిరించిన స్వీటీ.. ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియలో అయిన ఫ్యాన్స్ పలకరిస్తుంది అనుకుంటే ఏదైన స్పెషల్ డే రోజునే దర్శనం ఇస్తుంది. పండగలు, కొద్ది మంది సెలబ్రెటీల బర్త్‌డేలకు మాత్రమే స్వీటీ నెట్టింట కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాకు వచ్చింది. నిన్న(మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా స్వీటీ ఆసక్తికరంగా పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్‌లో.. ‘అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతీ ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
చదవండి: రెమ్యునరేషన్‌లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?
ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్, సోల్ ఫుల్లీ అందరూ బెస్ట్ ఉండేందుకు ప్రయత్నించాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతీక్షణాన్ని అనుభవించాలి. రోజురోజుకూ ఎదుగుతూ ఉండాలి. తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, ఫ్రెండ్‌గా, భర్తగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేమను పంచుతూ, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం, ప్రేమను పంచడం వంటివి చేస్తోన్న మగాళ్లందరికీ థ్యాంక్స్’ అని అనుష్క చెప్పుకొచ్చింది. ఇక స్వీటీ చాలా గ్యాప్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ ఒకే అంటుంది. ఇప్పటికే ఆమె యూవీ క్రియేషన్స్‌లో రెండు, మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా?
Comments
Please login to add a commentAdd a comment