సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక కానుకలు ఇవ్వాలని నిర్ణయించింది. నగరంలో పీక్ అవర్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపింది. ఈనెల 8న 60 ఏళ్లు పైబడిన మహిళలు వయసు ధ్రువపత్రం చూపి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని వెల్లడించింది. హెవీ వెహికిల్ నడపటంలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ, ఆసక్తి ఉన్న లైసెన్స్‌దారులు సమీపంలోని డిపోలో దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. 8వ తేదీ నుంచి 14 వరకు జీహెచ్‌ఎంసీ, వరంగల్ నగరాల పరిధిలో టీ24 టికెట్ ధరలపై రాయితీ ఉంటుందని తెలిపింది.
గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండు సీట్లు రిజర్వ్ చేస్తామంది. ఇక సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డ్రైవర్ వెనక రెండు సీట్లను మహిళలకు కేటాయించినట్లు, గుర్తుగా ప్రత్యేక రంగులు వేయించనున్నట్లు వివరించింది. అలాగే మార్చి 31 వరకు బస్టాండ్లలో ప్రత్యేకంగా కేటాయించే పర్పుల్ కలర్ బాక్సుల్లో తమ టికెట్లు వేస్తే, డ్రా ద్వారా విజేతలను గుర్తించి సంబంధిత డిపో నుంచి 30 కి.మీ. పరిధిలో ఉచితంగా ప్రయాణించేలా నెలవారీ సీజన్ టికెట్‌తోపాటు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ టికెట్‌తోపాటు తమ చిత్రాన్ని జోడిస్తూ 9440970000కు వాట్సాప్ చేస్తే, లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందిస్తామంది.
చదవండి: గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్
Comments
Please login to add a commentAdd a comment