సాక్షి, జగిత్యాల: ఆమె ఆధిక్యం.. దాదాపు రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఆడబిడ్డ అంటే భారం, బాధ, వివక్ష అనుకునే అడ్డంకులను దాటి.. అమ్మాయి అంటే ఆనందం అంటూ ‘ఊపిరి’పోస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రం దేశ సగటును మించి పురుషుల కంటే ఎక్కువ మహిళలతోనే కళకళలాడుతోంది. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక (2019–20) ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో సర్వే చేసిన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) ఆడబిడ్డల అడ్డగా జగిత్యాల తొలిస్థానంలో.. నిర్మల్, రాజన్నసిరిసిల్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పురుషులకంటే తక్కువ జనాభాతో హైదరాబాద్(959), ఆదిలాబాద్(992), మల్కాజిగిరి(996), వికారాబాద్(998) జిల్లాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment