సాక్షి, హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జనాభాలో సగం వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలకపాత్ర అని పేర్కొన్నారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవుదినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.
గవర్నర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా మన వారసత్వం, సంస్కృతి, సం ప్రదాయాలు మహిళలను ఆదిశక్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకు లింగ సమానత్వపు స్ఫూర్తి పెంపొందించడం, మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. కోవిడ్–19 మహ మ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన, త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment