చంద్రయాన్–3 మిషన్ చరిత్రాత్మక విజయం సాధించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ విజయం పట్ల ఎంతో గర్విస్తున్నా. దీంతో మ్రిత్ కాల్ లక్ష్య సాధనలో దేశం మరింత చేరువైంది. ఇస్రో శాస్త్రవేతలు, బృందంతో పాటు ప్రధా ని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు కూడా అభినందనలు. – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సేఫ్ ల్యాండింగ్ ద్వారా చంద్రయాన్–3 మిషన్ సంపూర్ణ విజయం సాధించడం గొప్ప విజయం. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా చేర్చిన మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించి అరుదైన చరిత్రను సృష్టించింది. ఇ ది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం.
ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, భాగస్వాములైన ప్రతి ఒ క్కరికీ అభినందనలు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్–3 విజయం గొప్ప ప్రేరణ ఇస్తుంది.
ఇదే స్ఫూర్తిని కొన సాగిస్తూ, దేశ కీర్తిప్రతిష్టలను మరింతగా పెంచే దిశ గా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజ య పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
చంద్రునిపై దక్షిణ ధ్రువానికి చంద్రయాన్–3 విజయవంతంగా చేరుకోవడం ఆనందంగా ఉంది. భారత అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక మైలురాయి, అద్భుత ఘటన. ఈ ఘనతను సాధించేందుకు ఇస్రో చేసిన కృషి, నిబద్ధత ఎనలేనిది. భారతీయ అంతరిక్ష ప్రయాణానికి ఇది అద్భుత సమయం. మనం చంద్రుడిపై ఉన్నాం. – ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment