టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని అర్థాంగి సాక్షి సింగ్ ధోని వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్ క్యాంపెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్ ధోని, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎస్‌కే యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో సాక్షి పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోలేం. ఒక క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు.
అయితే ఒక ఆటగాడిని పెళ్లి చేసుకుంటే చాలా మార్పులు వస్తాయి. స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకదు. కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు.
ఎంత క్రికెటర్ల భార్యలమైనా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. బయట మాకు ఎలాగు అవకాశం లేదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్చను ఉపయోగించుకోవాలనుకుంటాం. కానీ కొందరు దీనిని కూడా దూరం చేస్తున్నారు. ఇలాంటివి పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఇంకేమి ఉండదు'' అంటూ తెలిపింది.
ఇక గతేడాది ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన సీఎస్‌కే మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అందరికంటే ముందే ప్రాక్టీస్‌ను ప్రారంభించిన ధోని సేన ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్‌కే భావిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో తొలి మ్యాచ్ కేకేఆర్, సీఎస్‌కే మధ్య జరగనుంది.
చదవండి: WI vs ENG: పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు
IPL 2022: వార్న్ అంత్యక్రియలకు వార్నర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్
Comments
Please login to add a commentAdd a comment