అలంపూర్, న్యూస్‌లైన్: భూ తగాదాలు భగ్గుమన్నాయి. దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని జిల్లెలపాడు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సైదయ్య వివరాలు..గ్రామానికి చెందిన నాగ్యనాయక్, ఉసేన్ మధ్య గత రెండురోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో చిన్న ఉసేన్ శుక్రవారం ఉదయం పేడ గంపను దిబ్బలో వేయడానికి వెళ్లగా నాగ్యానాయక్ అతని అనుచరులు కొందరు ఉసేన్‌పై దాడికిదిగారు. దీంతో ఉసేన్ కుటుంబసభ్యులు అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటామాట పెరిగి ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అయ్యన్నను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్న ఉసేన్, పెద్ద ఉసేన్, తిరుపతయ్యలను చికిత్సకోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
జిల్లెలపాడు గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మె ల్యే అబ్రహాం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఘట నకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నరసింహులు, ఉండవెల్లి వెంకటన్న, నర్సన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
భగ్గుమన్న భూతగాదాలు
Published Sat, Nov 16 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement