మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు ఓకేనా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని పలు విభాగాల్లో మిడ్–క్యాప్ ఫండ్స్ కూడా ఒక రకం. మార్కెట్లు బాగున్నప్పుడు ఈ ఫండ్స్ మంచి రాబడినే అందిస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు ఈ మిడ్–క్యాప్ ఫండ్స్‌వైపు ఆకర్షితులౌతున్నారు. అదేవిధంగా మార్కెట్లు బాగాలేనప్పుడు వీటి పనితీరు కూడా ఏమీ బాగుండదు. అంటే మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతారు కూడా.
రిస్క్ ఉన్నప్పటికీ పోర్ట్‌ఫోలియోలో మిడ్–క్యాప్ ఫండ్స్‌కి అంతోఇంతో చోటివ్వాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మిడ్–క్యాప్ ఫండ్స్ గత పనితీరును పరిశీలిస్తే ఇవి సగటున మంచి రాబడులనే అందించాయి. 2015 మార్కెట్ పతనంలో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ఏకంగా 80 శాతం దాకా పడ్డాయి. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్పంగానే క్షీణించాయి. అందుకే మీరు మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. అధిక రిస్క్‌ను భరించాల్సి వస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
అలాగే మిడ్–క్యాప్ ఫండ్స్‌లోకి అడుగుపెట్టాలనుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్లను ఎక్కువ కాలం అలాగే ఉండేలా చూసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో మిడ్–క్యాప్‌కు 25–30 శాతం వాటాను కేటాయిస్తే మంచిది. ఇంతే మొత్తంలో కేటాయింపులు చేయాలనీ ఏమీ లేదు. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అనే అంశానికి అనుగుణంగా మీ కేటాయింపులు ఉండేలా చేసుకోండి. ఎక్కువ రాబడి కోరుకునే వారు ఈ వాటాను ఇంకా పెంచుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమయ్యేటప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారు అవుతాయని మరచిపోకండి.
ఫైనాన్షియల్ బేసిక్స్..
Published Mon, Apr 10 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
Advertisement