ఈ కారణాలు కూడా చూడాల్సిందే...
చాలామంది మహిళలు ఆశావహ దృక్పథంతో జీవిస్తుంటారు. వీరి భవిష్యత్తు ఆలోచనలు, కోరికలు అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. అందుకనే ‘నేను లేకపోతే’ అన్న ఆలోచన వారి దరిచేరదు. అందుకనే బీమా కొనడమనేది నెగటివ్ అనుకుంటారు. నిజమే... వీరి లోటును జీవిత బీమా పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ వీరిపై ఆధారపడ్డ వారికి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించగలదు. అలాగే చాలామంది నేను ఆరోగ్యంగా ఉన్నాను కనక ఇంత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకోవడం అనవసరమని భావిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ తప్పుదోవ పట్టించేవేనని చెప్పాలి. మీతో పనిచేస్తూ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారి అనుభవాలను తెలుసుకోండి. బీమాపై మీకు నమ్మకం కలిగేంత వరకు ఆగకుండా... ఉద్యోగంలో చేరిన వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.