
Tim Cook says he owns cryptocurrency : యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాస్పద కరెన్సీగా చెలమని అవుతోన్న క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా మాట్లాడారు. ఎలన్‌మస్క్ , జాక్‌డోర్సేల తర్వాత మరో దిగ్గజ కంపెనీ సీఈవో క్రిప్టో పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం.
యాపిల్ లాంటిదే
స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో కరెన్సీ విషయంలో క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదేనంటూ క్రిప్టో కరెన్సీ , ఆగ్యుమెంటెడ్ రియాల్టీలకు సంబంధించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ మేరకు బిజినెస్ ఇన్‌సైడర్ ఓ కథనం ప్రచురించింది. తన పోర్ట్‌ఫోలియోలో క్రిప్ట్ కరెన్సీ కూడా ఉందని టిమ్ కుక్ చెప్పినట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఏ క్రిప్టో కరెన్సీలో టిమ్ కుక్ ఇన్వెస్ట్ చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఇప్పుడే అనుమతించం
క్రిప్టో కరెన్సీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసినంత మాత్రానా యాపిల్ ప్రొడక్టులకు సంబంధించిన లావాదేవీల్లో క్రిప్టోను ఇప్పుడప్పుడే అనుమతించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల టెస్లా కార్ల కొనుగోలు సమయంలో క్రిప్టో కరెన్సీని అనుమతిస్తామంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు.
చదవండి:ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు
Comments
Please login to add a commentAdd a comment