షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తు పట్ల నిశ్చింతంగ ఉండాలంటే మంచి కంపెనీలను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. ఎప్పుడు ఒకే సంస్థపై కాకుండా నాలుగైదు విభిన్న రంగాలకు చెందిన బెస్ట్ కంపెనీలు సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మేలు. షేర్ మార్కెట్‌కి సంబంధించిన ప్రాథమిక సూత్రాల్లో ఈ రెండు ఎంతో ముఖ్యం. వీటిని తూచా తప్పకుండా పాటించిన వారికి స్టాక్ మార్కెట్‌లో కలిసి వచ్చింది. కాసుల వర్షం కురిపించింది.
పట్టు పెంచుకోవాలి
అయితే మంచి కంపెనీలను ఎంచుకోవడం, భవిష్యత్తు ఉన్న రంగాలను ముందుగానే పసిగట్టడం వంటి పనులు చేయాలంటే ఎంతో నేర్పు, మార్కెట్ పట్ల అవగాహన ఉండాలి. లేదంటే చాన్నాళ్లుగా మార్కెట్‌లో కొనసాగుతూ తమ ఇన్వెస్ట్‌మెంట్‌కి తగ్గ లాభాలను ఆర్జిస్తున్న వారిని పరిశీలించడం బెటర్. తద్వారా మార్కెట్ మీద పట్టు పెంచుకోవచ్చనేది ఆర్థిక నిపుణుల సలహా.
పోర్ట్‌ఫోలియో
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాధాకిషన్ దమానీ, అజీమ్ ప్రేమ్‌జీ ఇలా స్టాక్ మార్కెట్‌లో చాలా కాలం నుంచి కొనసాగుతూ తమ పొర్ట్‌ఫోలియోలో వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీల స్టాక్‌లను మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొన్సి షేర్ల ధరలు మార్కెట్ ఎంట్రీ లెవల్లో ఉన్న వారు భరించలేని ధరతో ఉన్నాయి. మరికొన్ని కొంచెం తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బిగినర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనువుగా ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు ..
అజీమ్ ప్రేమ్‌జీ
మన దేశంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకడైన అజీమ్ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియోలో విప్రో, ట్యూబ్ ఇండియా, జైడస్ వెల్‌నెస్, ట్రెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో విప్రోలో బ్రాండ్ కింద హోంకేర్, పర్సనల్ కేర్, వెల్‌నెస్, మేల్‌గ్రూమింగ్, ఆఫీస్ సొల్యూషన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో జైడస్, దుస్తుల విభాగంలో టాటా సబ్సిడరీ ట్రెంట్, ఆటోమొబైల్ విభాగంలో టీఐ కంపెనీల షేర్ల తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు అజీమ్ ప్రేమ్‌జి.
- విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.652లుగా ఉంది. గతేడాది ఈ షేరు ధర కేవలం రూ.351గా నమోదు అయ్యింది
- ట్యూబ్ ఇండియా (టీఐ) షేరు ధర ప్రస్తుతం రూ.83.60లు ఉండగా ఏడాది కిందట రూ. 16.90లుగా ఉంది.
- జైడస్‌వెల్ షేర్ ధర రూ.2050 ఉండగా ఏడాది కిందట రూ.1720గా ఉంది.
- ట్రెంట్ షేర్ ధర రూ.1095 ఉండగా ఏడాది కిందట రూ. 681గా ట్రేడ్ అయ్యింది.
రాకేశ్ అండ్ రాధకిషన్
- మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝన్‌ఝున్‌వాలా విషయానికి వస్తే ఆయన పోర్ట్‌ఫోలియోలో టైటాన్, ఎన్‌సీసీ, క్రిసిల్, టాటా కమ్యూనికేషన్స్‌లు ఉన్నాయి. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అసోసియేట్స్ పోర్ట్‌ఫోలియోలో పైన పేర్కొన్న మూడింటితో పాటు ఎస్కార్ట్ కూడా ఉంది.
- డీమార్ట్ సంస్థల అధినేత ఒకప్పటి మార్కెట్ బేర్ రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియోలో డీమార్ట్, ది ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి.
- ఆశీష్ దావన్ పోర్ట్‌ఫోలియోలో బిర్లాసాఫ్ట్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఐడీఎఫ్‌సీ, గ్లెన్‌మార్క్‌లు ఉన్నాయి
- ముఖుల్ అగర్వాల్ పోర్ట్‌ఫోలియోలో ఇంటెలెక్ట్, రెలిగేర్, మాస్టెక్, ఏపీల్ అపోలోలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment