ఇద్దరు డిప్యూటీ సీఎంలు!
- ఒకరు మైనారిటీ, మరొకరు ఎస్సీ
- మహమూద్ అలీ, ఈశ్వర్ లేదా రాజయ్య
- కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు
- సంక్షేవు శాఖలన్నీ కేసీఆర్ వద్దే!
- కేటీఆర్‌కు మౌలికం, పరిశ్రమలు, ఐటీ
- హరీశ్‌కు సాగునీరు, ఇంధనం
- ఈటెలకు ఆర్థికం, రెవెన్యూ
- నాయినికి హోం, పద్మారావుకు ఎక్సైజ్!
- జలగంకు రోడ్లు, భవనాలు
- జగదీశ్వర్‌రెడ్డికి పంచాయతీరాజ్
- సురేఖ, పద్మల్లో ఒకరికి అవకాశం
- స్పీకర్‌గా చందూలాల్ లేదా పోచారం
హైదరాబాద్, సాక్షి ప్రధాన ప్రతినిధి: తెలంగాణ తొలి వుుఖ్యవుంత్రిగా సోవువారం ప్రవూణ స్వీకారం చేయుటానికి సిద్ధవువుతున్న కె.చంద్రశేఖరరావు తన వుంత్రివర్గ కూర్పును దాదాపుగా పూర్తి చేశారు. కేబినెట్‌లోకి ఇద్దరు ఉప వుుఖ్యవుంత్రులను తీసుకోవటానికి ఆయున నిర్ణరుుంచినట్టు సవూచారం. మైనారిటీలకు ఉప వుుఖ్యవుంత్రి పదవి ఇస్తానన్న తన గత హామీ మేరకు ఎమ్మెల్సీ వుహవుూద్ అలీకి అవకాశం కల్పించనున్నారు. దళితులకూ ప్రాధాన్యమిస్తాన న్న హామీ ప్రకారం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను వురో డిప్యూటీ సీఎంగా తీసుకోనున్నట్టు సవూచారం.
ఈ విషయుంలో చివరి క్షణంలో వూర్పు చేయూలనుకుంటే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యుకు అవకాశం ఇవ్వవచ్చుననీ తెలుస్తోంది. ఒక డిప్యూటీ సీఎంకు హోం శాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక గిరిజనులకు కూడా అధిక ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చినందున వుులుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు వుంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు. ఐతే సీనియుర్ నేత, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గనుక స్పీకర్‌గా ఉండటానికి ఇష్టపడకపోతే చందూలాల్‌ను స్పీకర్‌గా ఎంపిక చేసి ఆయనను వుంత్రివర్గంలోకి తీసుకుంటారు.
పార్టీ ఆవిర్భావం నుంచీ పని చేస్తున్న నారుుని నర్సింహారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికవకపోరుునా ఆయున విధేయుత, సీనియూరిటీ దృష్ట్యా వుంత్రివర్గంలోకి తీసుకుని ఏదైనా వుుఖ్య శాఖ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణరుుంచారు. ఒకవేళ డిప్యూటీ సీఎంకు హోం శాఖ ఇవ్వొద్దని చివర్లో నిర్ణరుుస్తే ఆ పోస్టు నారుునికే దక్కవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారుు.
కేటీఆర్‌కు వుంత్రిపదవే!
టీఆర్‌ఎస్ పగ్గాలను కేసీఆర్ తన కువూరుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరావూరావు (కేటీఆర్)కు అప్పగిస్తారనే ప్రచారం జరిగినా, మొత్తానికి ఆయునను కూడా వుంత్రివర్గంలోకే తీసుకోవాలని ఆయన అంతివుంగా నిర్ణరుుంచారు. ఆయన వలిక వసతులు, పరిశ్రవులు, ఐటీ శాఖలు అప్పగిస్తారని విశ్వసనీయు సవూచారం. ప్రత్యేక తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి కీలకం కాబోతున్నందున కేటీఆర్‌కే ఆ బాధ్యతలు ఇవ్వనున్నారు. అలాగే తన మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అంతా ఊహిస్తున్నట్టుగానే సాగునీరు, ఇంధన శాఖలు అప్పగించనున్నారు.
మున్ముందు ఈ రెండు అంశాలపై సీవూంధ్రతో పలు వివాదాలు తలెత్తే ఆస్కారమున్నందున హరీశ్ అయితే వాటిపై సవుర్థంగా వ్యవహరిస్తారనేది కేసీఆర్ నమ్మిక. వీరిద్దరితో పాటు వురో వుుఖ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరానికే చెందిన ఎమ్మెల్యే పద్మారావుకు ఎక్సైజ్ శాఖ ఇవ్వనున్నారు. విధేయుత, సీనియూరిటీ, కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి ఉండడం పద్మారావుకు ప్లస్ పారుుంట్లు.
తను ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన పలు సంక్షేవు పథకాల్ని ఆశించినంత వేగంగా, సవుర్థంగా అవులు చేయుటానికి వీలుగా కేసీఆర్ అన్నిరకాల సంక్షేవు వుంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇంతటి టీఆర్‌ఎస్ గాలిలోనూ బీఎస్‌పీ నుంచి గెలుపొందిన ఇంద్రకిరణ్‌రెడ్డి, కోణప్ప ఇద్దరూ టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నా... వారికి వుంత్రి పదవుల్ని ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ లేనట్టు సవూచారం. ఆదిలాబాద్ సీనియుర్ ఎమ్మెల్యే జోగు రావున్నకు వూత్రమే అవకాశం. ఇక నిజావూబాద్ జిల్లాకు సంబంధించి పోచారం పేరు ఖాయుమైనా బీసీల నుంచి కావూరెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌కు ఇవ్వాలో, వద్దో కేసీఆర్ ఇంకా తుది నిర్ణయుం తీసుకోవాల్సి ఉంది.
నల్లగొండ జిల్లా నుంచి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డికి వుంత్రి పదవి ఖాయుమైంది. పంచాయుత్‌రాజ్ శాఖ దక్కే చాన్సుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు రోడ్లు, భవనాల శాఖ ఇవ్వవచ్చు. ఖవ్ముం జిల్లాలో పార్టీని బలంగా విస్తరించాలనే భావనతో ఆయునకు చాన్సిస్తున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిల్లో ఒకరికి పదవి దక్కనుంది. వుహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ ఎమ్మెల్యే, సీనియుర్ నేత జూపల్లి కృష్ణారావుతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే చెరుకు లక్ష్మారెడ్డికి కూడా వుంత్రివర్గంలోకి ప్రవేశం లభించనుంది.
రంగారెడ్డి జిల్లా నుంచి తాండూరు ఎమ్మెల్యే పట్లోళ్ల వుహేందర్‌రెడ్డి పేరు తుది పరిశీలనలో ఉంది. ఉద్యోగ వర్గాల ప్రతినిధికి వుంత్రిగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ఇంతకువుుందే ప్రకటించినందున స్వామి గౌడ్‌కు అవకాశం దక్కవచ్చు. ఆశావహులు ముమ్మరంగా ప్రయుత్నాలు చేసుకుంటున్నందున పలు సమీకరణాల నేపథ్యంలో ఒకటీ రెండు వూర్పుచేర్పులకు వీలుంది!
లాంఛనప్రాయంగా తొలి కేబినెట్ భేటీ
టీఆర్‌ఎస్ అధినేతగా, ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినరోజున మంత్రివర్గ సభ్యులతో లాంఛనంగా సమావేశం కానున్నారు. కాగా, ఈ సమావేశంలో నిర్ణయాలు, చర్చలు ఏమీ ఉండే అవకాశం లేదు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం, రైతుల రుణమాఫీ వంటి 10 పథకాలపై తొలి కేబినెట్‌లో చర్చించి, సంతకాలు చేస్తారని అంచనా వేసినా అవేమీ ఉండవని తేలుస్తోంది. జూన్ 2న ఉదయం 8.15కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12.57 నిమిషాలకు సచివాలయంలో ప్రవేశిస్తారు. అనంతరం కేబినెట్ సహచరులతో సమావేశం అవుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, తెలంగాణ రాష్ట్ర ఆర్థికస్థితి, మేనిఫెస్టోలోని అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వంపై ఉన్న బాధ్యతలు, రాజకీయ అవినీతి వంటివాటిపై మంత్రులకు కేసీఆర్ వివరిస్తారు. అంతకుమించి ఇప్పటిదాకా ప్రకటించిన పథకాలు, ఇతర అంశాలపై జూన్ 2న నిర్ణయాలేమీ ఉండవు. ప్రభుత్వం పనిచేయడానికి, ఫైళ్లను రూపొందించడానికి ప్రభుత్వానికి ప్రధానకార్యదర్శి, శాఖలకు ముఖ్యకార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం వంటి ప్రతిబంధకాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఫైళ్లు తయారుచేయడానికి అవసరమైన అధికారయంత్రాంగం లేకపోవడం వల్ల తొలిసంతకం, ఇతర ముఖ్యమైన అన్ని విషయాలపై మరొక రోజున నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ప్రారంభ దినోత్సవానికి కొంత గడువు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ప్రభుత్వయంత్రాంగం పూర్తిస్థాయిలో పని ప్రారంభించిననాడే ‘తెలంగాణ ప్రారంభ దినోత్సవం’ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అదే రోజు జరిగే కేబినెట్‌లో సంతకాలు వంటి ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మంత్రివర్గ సభ్యులకు పోర్టుఫోలియోలు, ఆయా శాఖల్లో ప్రభుత్వయంత్రాంగ నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీలైనంత తొందరగా కొత్త ప్రభుత్వం పనిచేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.