
డీఐవై ప్లాట్‌ఫామ్ ఎవరికి?
ఫైనాన్షియల్ బేసిక్స్..
పోర్ట్‌ఫోలియోకు సంబంధించి పారదర్శకత, గోప్యత, నియంత్రణను కోరుకునే ఇన్వెస్టర్లు డు-ఇట్-యువర్ సెల్ఫ్ (డీఐవై) ప్లాట్‌ఫామ్స్ వల్ల ప్రయోజనం పొందొచ్చు. అదే సమయంలో డీఐవైని కోరుకుంటున్నవారు వాటికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వారికి ఆ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి ఉండాలి. ఇక తెలివితేటలు తప్పనిసరి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ యుగంలో ఇంటర్నెట్టే సర్వస్వమయింది. దీని సాయంతో చాలా సమాచారాన్ని పొందొచ్చు. సమయం, ఆసక్తి ఉంటే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం కష్టం అనిపించదు.
టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్థిక కార్యకలాపాలు మినహాయింపేమీ కాదు. దీనికి ఉదాహరణే ఈ డీఐవై ప్లాట్‌ఫామ్స్.
డీఐవై ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్‌మెంట్లను ఒకేచోట భద్రపరచుకోవచ్చు. వాటికి సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అక్కడికక్కడే తెలుసుకోవచ్చు. దీంతో ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమౌతుంది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్స్ ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ వ్యయాలను తగ్గిస్తున్నాయి. ఇది అంతిమంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చుతుంది. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, సోషల్ మీడియా వంటి తదితర అంశాలు డీఐవై ప్లాట్‌ఫామ్స్ విస్తరణకు బాగా దోహదపడుతున్నాయి. డీఐవై ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్టర్లు వారి వారి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను వారే నిర్మించుకుంటారు. వారే నిర్వహించుకుంటారు.