DIY
-
డీఐవై లేడీ
‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ (డిఐవై) పాలసీని అనుసరిస్తే ఏమొస్తుంది? మెదడుకు పనిదొరుకుతుంది. షార్ప్ అవుతుంది. తనను తాను ‘డీఐవై లేడీ’గా పిలుచుకునే నటి, కంటెంట్ క్రియేటర్ శ్వేతా మహదిక్ పాత ఖాళీ రైస్ బ్యాగును స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌గా మలిచింది. కత్తిరింపు నుంచి మెషీన్‌పై కుట్టువరకు అన్నీ తానే స్వయంగా చేసింది. ఈ అందమైన బ్యాగ్‌కు గోల్టెన్కలర్ చైన్ జత చేసి ‘అప్క్లచ్డ్ బ్యాగ్’ అని నామకరణం చేసింది. బ్యాగు తయారీ ప్రక్రియకు సంబంధించిన వీడియోను శ్వేతా మహదిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్, శ్వేతా మహదిక్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. నెటిజనులు రకరకాల కామెంట్స్‌తో భారీగా స్పందించారు. వాటిలో మచ్చుకు మూడు... ‘ఇట్స్ రాకింగ్’ ‘మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అవార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలి’ ‘మీ వీడియో చూసి ఇప్పటికే రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తయారుచేశాను.’ -
ఒంటి దుర్వాసనకు చెక్ పెట్టండి
ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చాలామంది డియోడరెంట్లను ఉపయోగిస్తారు. అయితే దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల ఇళ్లు దాటి బయటకు వెళ్లలేకపోవడం, ఎలాగోలా అడుగు బయటపెట్టినా మార్కెట్లో మనకు కావాల్సిన డియోడరెంట్లు లభ్యం కాకపోవడం జరిగింది. దీంతో చాలామంది కంగారుపడిపోయారు. మరికొందరేమో ఉన్నవాటితోనే నెట్టుకొచ్చారు. కానీ ఎలాంటి చీకూచింతా లేకుండా దీన్ని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. (అరవైలోనూ స్వీట్ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చు..) తయారీ విధానం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల వెన్న వేసి, ఆపై ఒక చెంచాడు కొబ్బరి నూనె కూడా వేయండి. తర్వాత దీనిలో మూడు చెంచాల యారోరూట్ పొడి లేదా మక్కపిండి వేసి కలపండి. ఆపై సగం టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. పదార్థం జారుడుగా అవగానే 10 నుంచి 15 చుక్కాల ఎసన్షియల్ ఆయిల్‌ను వేసి మరోసారి కలపండి. అనంతరం దాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ఫ్రిజ్‌లో ఒక గంటపాటు ఉంచండి. దీంతో నేచురల్ సాఫ్ట్ డియోడరెంట్ క్రీమ్ రెడీ అయినట్లే. దీన్ని సాధారణ డియోడరెంట్లలాగానే చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. అయితే దీన్ని వాడే మొదటి రెండు వారాల్లో మీకు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. చంకల్లో చెమట ఎక్కువగా వస్తుంది. కానీ ఇది మీలోని విష పదార్థాలు బయటకు వెళుతున్నాయనడానికి సంకేతంగా భావించండి. సహజంగా తయారు చేసుకున్న ఈ డియోడరెంట్ దీర్ఘకాలం మంచి ఫలితాలనిస్తుందన్న విషయం మర్చిపోకండి. (బ్రైడ్ లుక్... ఫిల్మీ స్టైల్) -
డీఐవై ప్లాట్‌ఫామ్ ఎవరికి?
ఫైనాన్షియల్ బేసిక్స్.. పోర్ట్‌ఫోలియోకు సంబంధించి పారదర్శకత, గోప్యత, నియంత్రణను కోరుకునే ఇన్వెస్టర్లు డు-ఇట్-యువర్ సెల్ఫ్ (డీఐవై) ప్లాట్‌ఫామ్స్ వల్ల ప్రయోజనం పొందొచ్చు. అదే సమయంలో డీఐవైని కోరుకుంటున్నవారు వాటికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వారికి ఆ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి ఉండాలి. ఇక తెలివితేటలు తప్పనిసరి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ యుగంలో ఇంటర్నెట్టే సర్వస్వమయింది. దీని సాయంతో చాలా సమాచారాన్ని పొందొచ్చు. సమయం, ఆసక్తి ఉంటే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం కష్టం అనిపించదు. టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్థిక కార్యకలాపాలు మినహాయింపేమీ కాదు. దీనికి ఉదాహరణే ఈ డీఐవై ప్లాట్‌ఫామ్స్. డీఐవై ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్మెంట్లను ఒకేచోట భద్రపరచుకోవచ్చు. వాటికి సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అక్కడికక్కడే తెలుసుకోవచ్చు. దీంతో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమౌతుంది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్స్ ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ వ్యయాలను తగ్గిస్తున్నాయి. ఇది అంతిమంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చుతుంది. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, సోషల్ మీడియా వంటి తదితర అంశాలు డీఐవై ప్లాట్‌ఫామ్స్ విస్తరణకు బాగా దోహదపడుతున్నాయి. డీఐవై ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్టర్లు వారి వారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలను వారే నిర్మించుకుంటారు. వారే నిర్వహించుకుంటారు.