ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చాలామంది డియోడరెంట్‌లను ఉపయోగిస్తారు. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఇళ్లు దాటి బయటకు వెళ్లలేకపోవడం, ఎలాగోలా అడుగు బయటపెట్టినా మార్కెట్‌లో మనకు కావాల్సిన డియోడరెంట్‌లు లభ్యం కాకపోవడం జరిగింది. దీంతో చాలామంది కంగారుపడిపోయారు. మరికొందరేమో ఉన్నవాటితోనే నెట్టుకొచ్చారు. కానీ ఎలాంటి చీకూచింతా లేకుండా దీన్ని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. (అరవైలోనూ స్వీట్ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చు..)
తయారీ విధానం
ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్‌ల వెన్న వేసి, ఆపై ఒక చెంచాడు కొబ్బరి నూనె కూడా వేయండి. తర్వాత దీనిలో మూడు చెంచాల యారోరూట్ పొడి లేదా మక్కపిండి వేసి కలపండి. ఆపై సగం టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. పదార్థం జారుడుగా అవగానే 10 నుంచి 15 చుక్కాల ఎసన్షియల్ ఆయిల్‌ను వేసి మరోసారి కలపండి. అనంతరం దాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ఫ్రిజ్‌లో ఒక గంటపాటు ఉంచండి. దీంతో నేచురల్ సాఫ్ట్ డియోడరెంట్ క్రీమ్ రెడీ అయినట్లే.
దీన్ని సాధారణ డియోడరెంట్‌లలాగానే చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. అయితే దీన్ని వాడే మొదటి రెండు వారాల్లో మీకు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. చంకల్లో చెమట ఎక్కువగా వస్తుంది. కానీ ఇది మీలోని విష పదార్థాలు బయటకు వెళుతున్నాయనడానికి సంకేతంగా భావించండి. సహజంగా తయారు చేసుకున్న ఈ డియోడరెంట్ దీర్ఘకాలం మంచి ఫలితాలనిస్తుందన్న విషయం మర్చిపోకండి. (బ్రైడ్ లుక్... ఫిల్మీ స్టైల్)
Comments
Please login to add a commentAdd a comment