సీజన్ ఏదైనా పెదవుల రక్షణకు లిప్ బామ్ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్‌గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్ బామ్ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన పోషణ లభించేలా చేయవచ్చు.
లిప్ బామ్ తయారీ
రెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్ కోక్ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్ పౌడర్ వేసి బాగా కలపాలి. కోక్ పౌడర్ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్‌లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్‌ను తయారు చేసుకోవడం వల్ల హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు. అలాగే కృత్రిమ సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment