Lip balm
-
నేచురల్‌గా ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోండిలా!
సీజన్ ఏదైనా పెదవుల రక్షణకు లిప్ బామ్ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్‌గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్ బామ్ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన పోషణ లభించేలా చేయవచ్చు.లిప్ బామ్ తయారీరెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్ కోక్ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్ పౌడర్ వేసి బాగా కలపాలి. కోక్ పౌడర్ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్‌ను తయారు చేసుకోవడం వల్ల హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు. అలాగే కృత్రిమ సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు. -
Beauty Tips: మ్యాట్ లిపిస్టిక్ వేసుకునే ముందు ఇవి పాటించండి! లేదంటే
Beauty Tips In Telugu: లిప్‌స్టిక్ కొనే ముందు దానిలో ఆయిల్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే లిప్‌స్టిక్ వేసిన తరువాత పెదాలు పగిలినట్లు అవుతాయి. అందుకే మ్యాట్ లిపిస్టిక్ వేయకముందు పెదాలకు లిప్‌బామ్ లేదా కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి. ►లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్ వేయాలి. ►బ్రష్‌తో కాకుండా ట్యూబ్‌తోనే మ్యాట్ లిప్‌స్టిక్‌ను వేసుకోవాలి ►మ్యాట్ వేసిన తరువాత కాసేపు చేతులు పెట్టకుండా ఆగాలి. ►ఈ లిప్‌స్టిక్ ఆరడానికి సమయం పడుతుంది కాబట్టి వెంటనే టచ్ చేయకూడదు. ►లేదంటే లిప్‌స్టిక్ షేపవుట్ అవుతుంది. ►ఇవన్నీ పాటిస్తే మీ మ్యాట్ లిప్‌స్టిక్ క్లాసీగా, పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి. చదవండి: Korean Slap Therapy: ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే! -
Beauty Tips: పెదాలను సెలైవాతో తడిచేస్తున్నారా .. అందులోని ఎంజైమ్స్ వల్ల!
Beauty Tips In Telugu: చలికాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెట్టే సమస్య పెదవులు పగలడం. ఇది అధరాల అందాన్ని చికాకు పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి. పెదవులకు పెట్రోలియం జెల్ రాసి, మృదువైన బ్రిజిల్స్ ఉండే టూత్ బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయాలి. ►ఆ తర్వాత ఏదైనా లిప్ బామ్ లేదా వెన్న/మీగడ రాసుకోవాలి. దీనివల్ల పెదవులపై ఉన్న మృతకణాలు రాలిపోయి, పెదవులు మృదువుగా మారతాయి. అయితే, కర్పూరం, మెంథాల్ కలిగి ఉన్న లిప్‌బామ్ వాడకపోవడమే మంచిది. సన్‌స్క్రీన్ ఉన్నవి వాడితే బెటర్. ►ఎక్కువగా నీటిని తాగాలి. చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. ►నిజానికి చాలా మంది పెదవులు పొడిబారగానే ఉమ్మితో తడి చేసుకుంటూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం పెదవులకు ఇది చేటు చేస్తుంది. పెదాలను ఉమ్మితో తడపటం వల్ల మరింత తొందరగా పొడిబారడమే గాకుండా... ఆహారాన్ని జీర్ణం చేయగల సెలైవాలోని కొన్ని ఎంజైమ్స్ కారణంగా అధరాలు మంటపుట్టే అవకాశం ఉంటుంది. ►ఇక బయటకు వెళ్లినపుడు కచ్చితంగా లిప్‌బామ్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు. కంటికింద నల్లటి వలయాలా? ►కంటి దిగువన నల్లటి వలయాలు ఇటీవల కాలంలో ఇంచుమించు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి రాత్రిళ్లే సరైన సమయం. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. లేదంటే కొబ్బరినూనె అయినా వాడవచ్చు. కంటి కింద ఉన్న చర్మానికి ఈ నూనె రాయాలి. తర్వాత ఉంగరపు వేలిని ఉపయోగించి కంటి దిగువ భాగాన్ని ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇంటిప్స్ ►వార్డ్‌రోబ్‌లో ఉన్న దుస్తులన్నింటినీ ఒకసారి బయటకు తీసి చూడండి. గడచిన ఏడాది కాలంగా ఒక్కసారి కూడా ధరించని వాటిని పక్కన పెట్టండి.సైజు కుదరనివి, బోర్ కొట్టినవి, ట్రెండ్ మారిపోయిందని ధరించడం మానేసినవి ఒక బ్యాగ్‌లో సర్దండి. వాటిని దగ్గరలో ఉన్న చిన్న పిల్లల అనాథ శరణాలయం, వృద్ధాశ్రమాల్లో ఇవ్వవచ్చు. చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే.. Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! -
జింగ్ జింగ్.. ఈ పాప తెలివి అమేజింగ్!
న్యూయార్క్ : అవసరమే మనకు అన్నీ నేర్పిస్తుందనడానికి ఓ చిరు ఉదాహరణ ఈ సంఘటన. తరగతి గదిలో ఆకలి తీర్చుకోవటానికి ఓ చిన్నారి చేసిన తెలివైన పని ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సెయింట్ లూయిస్‌కు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలికకు తరగతి గదిలో ఉండగా తరుచూ ఆకలి వేస్తుండేది. ఏదైనా తిందామంటే టీచర్లు ఏమైనా అంటారేమోనన్న భయం. దీంతో చాలా ఇబ్బంది పడేది. ఇక ఇలా అయితే కుదురదనుకున్న బాలిక ఓ చక్కటి ఉపాయం ఆలోచించింది. వాడిపడేసిన లిప్‌బామ్ ట్యూబ్‌ను తీసుకుని అందులో చీజ్‌ను నింపింది. దాన్ని పాఠశాలకు తీసుకెళ్లి టీచర్ల ముందే లిప్ బామ్ ట్యూబ్‌లోని చీజ్‌ను కొద్దికొద్దిగా తినేది. అది గమనించిన టీచర్లు కూడా లిప్ బామ్ అనుకుని ఊరుకున్నారు. ఆ బాలిక తల్లి వలరీ స్క్రాంప్ హన్... కూతురు తెలివికి ఆశ్చర్యపోయింది. లిప్ బామ్ ట్యూబ్‌లో నింపిన చీజ్ ఫొటోను బుధవారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కామెంట్ పెట్టింది. చిన్నారి తెలివికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. రెండు రోజుల్లో ఆ పోస్ట్ 52వేల లైకులు సంపాదించటంతో పాటు 6వేల మంది దాన్ని రీట్వీట్ చేశారు. ‘‘ భవిష్యత్తు మొత్తం ఆడవాళ్లదే.. నీ కూతురు 2079లో ఉంది. మనం ఇంకా 2019లో ఉన్నాం.. నువ్వు జీనియస్వి పాప’’ అంటూ నెటిజన్లు పొగడ్తలతో బాలికను ముంచెత్తుతున్నారు. -
బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా, మృదువుగా ఉండాలంటే తరచూ లిప్ బామ్ రాస్తుండటం ఎంతో మేలు. అలా అని మార్కెట్లో దొరికే లిప్‌బామ్ వాడితే ఒక్కోసారి సైడ్ఎఫెక్ట్స్ బాధ కూడా తప్పదు. అలా కాకుండా పెదాలు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండాలంటే హోమ్మేడ్ లిప్‌బామ్ వాడితే మంచిది. దాని తయారీ విధానం చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ క్రాన్బెర్రీ జూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ (వ్యాజెలిన్) వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ చిన్న బాటిల్లో నింపి డీప్ ఫ్రిజ్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. అంతే! ఆరోగ్యకరమైన లిప్‌బామ్ రెడీ. వర్షాకాలంలో రోడ్లపై ఉండే నీళ్లలో నడిచినా, ఇంట్లో ఎక్కువగా నీళ్లలో ఉన్నా చాలామంది మహిళలకు పాదాలు పగులుతుంటాయి. కొంతమందికి ఆ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అలాంటి వారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. దానికోసం కరిగించిన ప్యారాఫిన్ వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మర్దన చేసుకుంటూ పాదాలను కడిగేసుకోవాలి. ఇలా 10-15 రోజులు రెగ్యులర్‌గా చేస్తే పగుళ్లు లేని మృదువైన పాదాలు మీ సొంతం.