Beauty Tips In Telugu: చలికాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెట్టే సమస్య పెదవులు పగలడం. ఇది అధరాల అందాన్ని చికాకు పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి. పెదవులకు పెట్రోలియం జెల్ రాసి, మృదువైన బ్రిజిల్స్ ఉండే టూత్ బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయాలి.
►ఆ తర్వాత ఏదైనా లిప్ బామ్ లేదా వెన్న/మీగడ రాసుకోవాలి. దీనివల్ల పెదవులపై ఉన్న మృతకణాలు రాలిపోయి, పెదవులు మృదువుగా మారతాయి. అయితే, కర్పూరం, మెంథాల్ కలిగి ఉన్న లిప్‌బామ్ వాడకపోవడమే మంచిది. సన్‌స్క్రీన్ ఉన్నవి వాడితే బెటర్.
►ఎక్కువగా నీటిని తాగాలి. చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంటాయి.
►నిజానికి చాలా మంది పెదవులు పొడిబారగానే ఉమ్మితో తడి చేసుకుంటూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం పెదవులకు ఇది చేటు చేస్తుంది. పెదాలను ఉమ్మితో తడపటం వల్ల మరింత తొందరగా పొడిబారడమే గాకుండా... ఆహారాన్ని జీర్ణం చేయగల సెలైవాలోని కొన్ని ఎంజైమ్స్ కారణంగా అధరాలు మంటపుట్టే అవకాశం ఉంటుంది.
►ఇక బయటకు వెళ్లినపుడు కచ్చితంగా లిప్‌బామ్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు.
కంటికింద నల్లటి వలయాలా?
►కంటి దిగువన నల్లటి వలయాలు ఇటీవల కాలంలో ఇంచుమించు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి రాత్రిళ్లే సరైన సమయం. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. లేదంటే కొబ్బరినూనె అయినా వాడవచ్చు.
కంటి కింద ఉన్న చర్మానికి ఈ నూనె రాయాలి. తర్వాత ఉంగరపు వేలిని ఉపయోగించి కంటి దిగువ భాగాన్ని ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా సున్నితంగా మసాజ్ చేయాలి.
ఇంటిప్స్
►వార్డ్‌రోబ్‌లో ఉన్న దుస్తులన్నింటినీ ఒకసారి బయటకు తీసి చూడండి. గడచిన ఏడాది కాలంగా ఒక్కసారి కూడా ధరించని వాటిని పక్కన పెట్టండి.సైజు కుదరనివి, బోర్ కొట్టినవి, ట్రెండ్ మారిపోయిందని ధరించడం మానేసినవి ఒక బ్యాగ్‌లో సర్దండి. వాటిని దగ్గరలో ఉన్న చిన్న పిల్లల అనాథ శరణాలయం, వృద్ధాశ్రమాల్లో ఇవ్వవచ్చు.
చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే..
Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం!
Comments
Please login to add a commentAdd a comment