అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్‌..! ట్రయంఫ్‌ నుంచి..! | Triumph Most Affordable Tiger Bike to Launch | Sakshi
Sakshi News home page

అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్‌..! ట్రయంఫ్‌ నుంచి..!

Published Mon, Mar 28 2022 6:31 PM | Last Updated on Mon, Mar 28 2022 6:43 PM

Triumph Most Affordable Tiger Bike to Launch - Sakshi

ప్రముఖ లగ్జరీ బైక్ల తయారీదారు ట్రయంఫ్‌ మోటార్స్‌ సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. ట్రయంఫ్‌ టైగర్‌ లైనప్‌లో భాగంగా ‘టైగర్ స్పోర్ట్ 660'ను మార్చి 29, 2022న భారత్‌లో విడుదల చేయనుంది. టైగర్‌ లైనప్‌లో ఎంట్రీ లెవల్‌, అత్యంత సరసమైన ధరలో ‘ట్రయంఫ్‌ టైగర్‌ స్పోర్ట్స్‌ 660’ నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

గత వారం ట్రయంఫ్‌ మోటార్స్‌ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొత్త బైక్‌ టీజర్‌ లాంచ్‌ చేసింది. భారత్‌లోని తమ టైగర్ లైనప్‌లో 850 స్పోర్ట్, టైగర్ 900 బైక్స్‌ ఉన్నాయి. వీటితోపాటుగా హై-పెర్ఫార్మెన్స్ టైగర్ 1200ని త్వరలోనే లాంచ్‌ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. 

డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..LED హెడ్‌ల్యాంప్‌తో ఎయిర్ వెంట్,  బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్‌తో స్పోర్టీ లుక్‌ను పొందనుంది. రేడియేటర్ కౌల్‌ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్‌ మోటార్స్‌ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్‌గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. 

టైగర్ స్పోర్ట్ 660 ఇంజన్‌ విషయానికి వస్తే...ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఇంజన్‌ను పోలీ ఉండనుంది. 660cc ఇన్‌లైన్-త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 81 hp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ట్రెయిన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జత చేసే అవకాశం ఉంది. ఈ బైక్‌ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. రాబోయే ట్రయంఫ్‌ టైగర్ స్పోర్ట్ 660 బైక్‌ ధర రూ. 8.5 లక్షలుగా ఉండవచ్చని అంచనా. కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి వంటి బైక్లకు పోటీగా నిలవనుంది. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంట్రీ..పీవీఆర్‌తో కొత్త దోస్తీ..ఊహించిన లాభాలు సొంతం...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement