
సూపర్‌బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఆధునీకరించిన స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.35 లక్షలు. 65 పీఎస్ పవర్‌తో 900 సీసీ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. రోడ్, రెయిన్, ఆఫ్–రోడ్ రైడింగ్ మోడ్స్‌లో రూపొందించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అనలాగ్ స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచేబుల్ ఏబీఎస్, టార్క్ అసిస్ట్ క్లచ్, డిస్టింక్టివ్ ఎల్‌ఈడీ రేర్ లైట్, యూఎస్‌బీ చార్జర్, ఇమ్మొబిలైజర్ వంటి హంగులు ఉన్నాయి. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. వాహనం 223 కిలోల బరువు ఉంది. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు.