న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రీమియమ్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంఫ్ టైగర్ 800 సిరీస్‌లో మరో ఖరీదైన బైక్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ 800 ఎక్స్‌సీఏ పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.15.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). మరింత మెరుగైన ఫీచర్లతోఈ ఆఫ్–రోడ్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది.
800 సీసీ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో ఆరు రైడింగ్ మోడ్స్ ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ చెప్పారు. ఈ బైక్‌లో ఎల్‌ఈడీ లైట్లు, జాయ్‌స్టిక్ కంట్రోల్, అల్యూమినియమ్ ఫినిష్డ్ రేడియేటర్ గార్డ్, టీఎఫ్‌టీ స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు.
ట్రయంఫ్ నుంచి మరో ఖరీదైన బైక్
Published Tue, Mar 12 2019 12:58 AM | Last Updated on Tue, Mar 12 2019 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment