ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ భారత్‌లో ప్రవేశ పెట్టిన కొత్త సూపర్ బైక్ ఇది. టీ100 పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). రూ.5 లక్షలకు మించిన 500 సీసీ బైక్‌ల మార్కెట్లో అగ్రస్థానం సాధించడం తమ లక్ష్యమని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి పేర్కొన్నారు.