super bikes
-
డుకాటి ఇండియా సూపర్ బైక్స్: దిమ్మ దిరిగే ధరలు
న్యూఢిల్లీ: డుకాటి ఇండియా 2022 పానిగేల్ వీ4 రేంజ్ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర రూ. 26.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. వేరియంట్లు ఉన్నాయి - స్టాండర్డ్, ఎస్,ఎస్పీ-2 ఇలా మూడు వేరియంట్లలో ఈ సూపర్ బైక్ అందుబాటులో ఉంది. అయితే ఫీచర్లను అప్డేట్ చేయడమే కాదు ధరలను కూడా అదే రేంజ్లో పెంచేసింది. కొత్త గ్రాఫిక్లతోపాటు, అద్భుతమైన డిజైన్‌తో 2022 పనిగేల్ వీ4 బైక్స్‌ని అప్డేట్ చేసింది. ఇక ధరల విషయానికి వస్తే బేస్ వేరియంట్ ధరను గతం కంటే రూ. 3 లక్షలు పెంచింది. ఎస్ ధర రూ. 31.99 లక్షలు (గతం కంటే రూ. 3.59 లక్షలు ఎక్కువ) ఎస్పీ2 ధర రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)( సుమారు 4 లక్షలు ఎక్కువ) .ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో మొత్తం 3 వేరియంట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంజీన్ 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ . దీనికి కొత్త సైలెన్సర్ ఆయిల్ పంప్‌ను జోడించింది. తద్వారా ఈ ఇంజీన్ సామర్థ్యం 13,000 RPM వద్ద 215.5 HP , 9500 RPM వద్ద 123.6 Nm వరకుపెరిగిందని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఫుల్లీ రెడ్ ఫెయిరింగ్లపై బ్లాక్ లోగోలు, డబుల్ ఫాబ్రిక్ సాడిల్, బ్లాక్ రిమ్స్‌పై రెడ్ ట్యాగ్ (S వేరియంట్లో) జోడించింది. హై ఎండ్ వేరియంట్ ఎస్పీ 2లో 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్నే అమర్చింది. ఇంకా ఇటాలియన్ ఫ్లాగ్‌తో కూడిన కార్బన్ ఫైబర్‌లో వింగ్స్, STM-EVO SBK 9-డిస్క్ డ్రై క్లచ్, డెడికేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్స్, 520 చైన్, ఎడ్జస్టబుల్ రైడర్ ఫుట్-పెగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిమోట్ అడ్జస్టర్, మెషిన్డ్ బ్రేక్ చ, క్లచ్ లివర్లతో కూడిన బ్రెంబో MCS మాస్టర్ సిలిండర్, 9-స్పోక్ ఫోర్డ్ మెగ్నీషియం వీల్స్, కార్బన్ ఫైబర్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్ , సింగిల్ సీట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
దూసుకొచ్చిన ‘డుకాటి మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ మోటార్ బైక్‌ల తయారీ సంస్థ డుకాటి.. తన సూపర్ బైక్ మల్టిస్ట్రాడ 1260 బైక్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’ పేరుతో విడుదలైన ఈ బైక్ ధర రూ.19.99 లక్షలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలలోని తమ డీలర్ల వద్ద బైక్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గీ కానోవాస్ మాట్లాడుతూ.. ’ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్ ఇది. ఆఫ్ రోడ్ డ్రైవ్ ఇష్టపడే ఔత్సాహికుల స్పోర్టీ బైక్‌గా ఈ నూతన వేరియంట్‌ను అభివర్ణిస్తున్నాం’ అని అన్నారు. -
తెలంగాణలో తొలి బైక్ అసెంబ్లింగ్ ప్లాంట్
-
తెలంగాణలో బెనెల్లి బైక్స్ అసెంబ్లింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్ బైక్స్ బ్రాండ్ ‘బెనెల్లి’ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందుకు తెలంగాణ వేదిక అవుతోంది. సోమవారమిక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో బెనెల్లి బోర్డ్ డైరెక్టర్ జార్జ్ వాంగ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బెనెల్లి భారత భాగస్వామి అయిన ఆటోమొబైల్ రిటైల్ సంస్థ మహావీర్ గ్రూప్ కంపెనీ ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి వద్ద తొలుత 3 ఎకరాల్లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. రెండవ దశలో 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ ప్లాంటును నెలకొల్పుతారు. ప్రభుత్వం నుంచి సహకారం.. ప్లాంట్ల ఏర్పాటుకు బెనెల్లికి కావాల్సిన పూర్తి సహకారం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ‘అద్భుతమైన బైక్స్ బెనెల్లి సొంతం. ఇప్పుడు భారత్‌లో రోడ్లు మెరుగయ్యాయి. ఇటువంటి బ్రాండ్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే తయారైన వాహనాల రవాణా పరంగా చూస్తే హైదరాబాద్ అనువుగా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సులువుగా సరఫరా చేయవచ్చు. అలాగే ఆగ్నేయాసియా దేశాలు, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకూ ఎగుమతికి వీలుంది’ అని అన్నారు. ఇంజనీరింగ్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు, నాణ్యమైన విడిభాగాల తయారీ కంపెనీలు ఇక్కడ ఉన్నందునే ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకున్నారని జయేశ్ రంజన్ అన్నారు. తొలి బైక్ అక్టోబరులో.. అసెంబ్లింగ్ ప్లాంటు నుంచి బెనెల్లి తొలి బైక్ 2018 అక్టోబరులో రోడ్డెక్కనుందని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఎండీ వికాస్ జబక్ వెల్లడించారు. 7,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు. రెండో దశలో బైక్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. మూడు దశాబ్దాల్లో మెర్సిడెస్ బెంజ్, ఇసుజు, స్కోడా, బెనెల్లి బ్రాండ్లలో 50,000లకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నామని మహవీర్ గ్రూప్ చైర్మన్ యశ్వంత్ జబక్ తెలిపారు. కాగా, ఈ ఏడాదే లెంచినో, లెంచినో ట్రయల్, టీఆర్కే 502, టీఆర్కే 502 ఎక్స్, టీఎన్టీ 302 ఎస్ బైక్‌లు రోడ్డెక్కనున్నాయని బెనెల్లి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాంటే బస్టోస్ తెలిపారు. 250 సీసీ బైక్‌లు 2019లో ప్రవేశపెడతామన్నారు. భారత్‌లో బైక్‌ల ధర రూ.2 లక్షలతో మొదలై రూ.6 లక్షల వరకు ఉంది. -
పాత ఇనుముతో సూపర్ బైక్!
వైవీయూ: పాత ఇనుము సామానుతో రూపొందించిన ‘సూపర్ బైక్’అందరినీ ఆకర్షిస్తోంది. వైఎస్సార్ జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీనరసింహరాజు ఈ బైక్‌ను తయారు చేశారు. గతంలో వినూత్నమైన సైకిల్‌ను రూపొందించి మన్ననలు పొందిన ఈయన తాజాగా రూపొందించిన ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాత ఇనుమును వినియోగించి రూపొందించిన బైక్ 6 అడుగుల పొడవుతో రేసింగ్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. రూ.38 వేలు ఖర్చుతో 3 నెలలు శ్రమించి 55 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బైక్‌ను తీర్చిదిద్దారు. 6 అడుగులు ఉన్న ఈ బైక్‌ను అవసరమైతే 9 అడుగుల వరకు పొడిగించుకునేలా రూపొందించారు. లైటింగ్ సిస్టం ఆకట్టుకునేలా.. బైక్ వెళ్తున్న సమయంలో బంతి తిరుగుతూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. -
డుకాటీ కొత్త ‘మాన్స్టర్ 821’
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా తన ‘మాన్స్టర్ 821’లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.9.51 లక్షలు. కొత్త మాన్స్టర్ 821లో యూరో–4 ప్రమాణాలకు అనువైన 821 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ‘మాన్స్టర్ బైక్స్ గత 25 ఏళ్లుగా వినియోగదారుల ఆదరణను చూరగొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 25వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించాం’ అని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గి కానోవాస్ గారీగా తెలిపారు. తాజా మాన్స్టర్ 821 బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించామని, ఈ బైక్స్‌ను జూన్ తొలి వారం నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
మార్కెట్లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్’
ప్రారంభ ధర రూ.9.32 లక్షలు న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్స్ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా ‘స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్’ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.9.32 లక్షలు(ఎక్స్‌షోరూమ్). యూరో–4 నిబంధనలకు అనువైన 803 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీనితోపాటు స్క్రాంబ్లర్ ఐకాన్, స్క్రాంబ్లర్ క్లాసిక్ బైక్స్‌లో యూరో–4 వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.7.23 లక్షలు, 8.48 లక్షలుగా ఉన్నాయి. -
ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ భారత్‌లో ప్రవేశ పెట్టిన కొత్త సూపర్ బైక్ ఇది. టీ100 పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). రూ.5 లక్షలకు మించిన 500 సీసీ బైక్‌ల మార్కెట్లో అగ్రస్థానం సాధించడం తమ లక్ష్యమని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి పేర్కొన్నారు. -
అద్దె బైకులతో అదిరే సవారీ...
ద్విచక్ర వాహనాలు అద్దెకిస్తున్న వీల్ స్ట్రీట్ ♦ గేర్ లెస్ల నుంచి సూపర్ బైక్స్ వరకూ.. ♦ 6 నెలల్లో హైదరాబాద్‌లోనూ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐదో గేరులో దూసుకెళుతూ కూడా ఆరో గేరుంటే బాగుండునని ఆలోచిస్తున్నారు నేటి కుర్రకారు. ‘మామ్ అండ్ డ్యాడ్ గిఫ్ట్’ అనో.. ‘క్యాచ్ మీ ఇఫ్ యు కెన్’ అనో.. బైక్ వెనకాల రాయించుకొని యమా స్పీడుగా దూసుకుపోయే యువతకు అన్నం, నీళ్లు లేకపోయినా రోజు గడుస్తుందేమోగానీ బండి లేనిదే అరగంట కూడా గడవదు. ‘‘బైక్ అంటే సరదా కోసమే కాదు. అవసరంలో ఉపయోగపడాలి. నలుగురు వెరైటీగా ఉందని అబ్బురపడాలి. రోజుకో బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్లాలి’’ ఇది యువత స్ట్రాటజీ. అలాంటి యూత్ పల్స్ యూత్‌కే కరెక్ట్‌గా తెలుస్తుందని నిరూపించారు ఢిల్లీకి చెందిన మోక్షా శ్రీవాస్తవ. అందుకే ద్విచక్ర వాహనాలను అద్దెకిచ్చేందుకు ‘వీల్ స్ట్రీట్’ను ఆరంభించారు. వీల్ స్ట్రీట్ గురించి మరిన్ని విశేషాలను మోక్షా శ్రీవాస్తవ మాటల్లోనే.. రోజు వారీ అవసరాలకు.. నగరం నుంచి శివార్లలో ఉండే కళాశాలకు ఆటోలోనో లేకుంటే మెట్రో రైల్లోనో వెళ్లాలంటే చాలా ఇబ్బంది. రాత్రి సమయాల్లో అమ్మాయిలకైతే మరీను. పోనీ చిన్నపాటి బైకేదైనా కొందామంటే ఖర్చుతో కూడుకున్న పని. వీటన్నింటికి పరిష్కారం చూపిస్తుంది వీల్ స్ట్రీట్. గేరు, గేర్‌లెస్ రెండు రకాల ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇవ్వడమే మా ప్రత్యేకత. టూరిస్టులకు, కోచింగ్‌ల కోసం, ప్రాజెక్ట్ వర్క్ మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి.. వీకెండ్స్‌లో చుట్టాల ఇంటికి వెళ్లేందుకు, ఏదైనా దూరప్రాంతాల్లోని ఈవెంట్లను కవర్ చేయడానికి వెళ్లేందుకు ఈ అద్దె బైకులు చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం. 1,700లకు పైగా వాహనాలు.. ఆన్లైన్, ఎస్ఎంఎస్, వాట్స్ఆప్ల ద్వారా వీల్ స్ట్రీట్ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం 1,700 పైగా ద్విచక్ర వాహనాలు మా దగ్గరున్నాయి. అన్నీ 2012-2015 మధ్య విడుదలైన మోడళ్లే. వీటిలో ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్, సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైకులు కూడా ఉన్నాయి. బైకును బట్టి రోజు వారీ అద్దె ఉంటుంది. మామూలు బైకు అయితే రోజు అద్దె ధర రూ.300, అదే సూపర్ బైక్ అయితే రూ.10 వేల వరకూ ఉంటుంది. నెలా నెలా పెరుగుతున్న ఆదాయం.. కంపెనీ ప్రారంభించిన 6 నెలల వరకు ప్రచారం లేకపోవడంతో వ్యాపారం కాసింత తక్కువే జరిగేది. కానీ, మా ప్రత్యేకతలు, అద్దె ధరలు చూసి వ్యాపారం ఊపందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.90 వేల ఆదాయం గడిస్తే.. మేలో రూ.35 లక్షలు, జూన్‌లో 59 లక్షల ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గంట ముందు బుక్ చేసుకుంటే.. వాహనం కావాలనుకున్న గంట ముందు బుక్ చేసుకుంటే చాలు. బైక్‌ను అద్దెకిచ్చే ముందు ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు బైకును బట్టి రూ.1,000 నుంచి రూ.25 వేల వరకు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మిలియన్ డాలర్ల పెట్టు బడులు... గతేడాది డిసెంబర్లో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఆర్అండ్బీ పార్ట్నర్స్ వీల్స్ట్రీట్లో రూ.10 లక్షల పెట్టుబడులు పెట్టారు. కంపెనీ విస్తరణ అవసరాల నిమిత్తం మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఆటో కంపెనీ సిద్ధంగా ఉంది. 20 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఏడాది కాలంలో మా వెబ్‌సైట్‌ను సందర్శించిన వాళ్ల సంఖ్య 10 కోట్లకు పైమాటే. ప్రస్తుతం నెలకు 900 బుకింగ్స్ అవుతున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్‌లో.. 80కి పైగా డీలర్ల నుంచి అద్దె రూపంలో బైకులు తీసుకొని.. ఢిల్లీలో మాత్రమే సేవలందిస్తున్న వీల్స్ట్రీట్ను మరో రెండు నెలల్లో చంఢీగఢ్, పుణె, డెహ్రాడూన్ ప్రాంతాలకు విస్తరించబోతున్నాం. మరో 6 నెలల్లోగా హైదరాబాద్‌లో సేవలు ఆరంభించబోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో బైకులు అద్దెకిచ్చే డీలర్లతో సంప్రదింపులు పూర్తిచేశాం. ఎవరైనా వారి బైకును అద్దెకివ్వాలనుకుంటే అగ్రిగేటర్ ఫ్లాట్‌ఫామ్ మీద అద్దెకు తీసుకుంటాం. బైక్ కండిషన్ ఎలా ఉంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది వంటి వివరాలను పరిశీలించాకే బైకును అద్దెకు తీసుకుంటాం. -
భారత్‌కు బెనెల్లి 175 సీసీ స్కూటర్
దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్... డీఎస్కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ కంపెనీ బెనెల్లి 175 సీసీ కఫెనెరో స్కూటర్‌ను భారత్‌కు తీసుకొస్తోంది. రెండు నెలల్లో ఈ మోడల్ పనితీరును పరీక్షిస్తామని బెనెల్లి భారత భాగస్వామి అయిన డీఎస్కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. జబక్ ఆటో సహకారంతో ఏర్పాటైన డీఎస్కే బెనెల్లి షోరూంను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. బెనెల్లి 50 సీసీ స్కూటర్లు తయారు చేసినప్పటికీ, భారత్‌లో మాత్రం అధిక సామర్థ్యమున్న మోడళ్లనే విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళికల్లా 250 సీసీ సూపర్ బైక్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. మొత్తంగా ఏడాదిలో మరో నాలుగు మోడళ్లు రానున్నాయి. డీఎస్కే మోటోవీల్స్ బెనెల్లితోపాటు కొరియాకు చెందిన హ్యోసంగ్ బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. విస్తరణ దిశగా..: హైదరాబాద్‌తో కలిపి డీఎస్కే బెనెల్లి షోరూంలు దేశంలో 6 ఉన్నాయి. మరో 14 షోరూంలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అయిదు మోడళ్లను విక్రయిస్తున్నారు. ఇవి 300 సీసీ మొదలుకుని 1,131 సీసీ వరకు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 400కుపైగా బుకింగ్స్ నమోదయ్యాయి. 2015-16లో 3,000 బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 10% హైదరాబాద్ నుంచి ఆశిస్తోంది. అలాగే హ్యోసంగ్ షోరూంలు 41 ఉన్నాయి. మరో 3 ఏర్పాటు చేస్తున్నారు. 6 రకాల మోడళ్లు 250 నుంచి 678 సీసీ వరకు ఉన్నాయి. గత మూడేళ్లలో 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల బైక్‌ల విక్రయం లక్ష్యంగా చేసుకుంది. పుణే సమీపంలోని ప్లాంటులో రెండు బ్రాండ్ల వాహనాలను అసెంబుల్ చేస్తున్నారు. 10 వేల యూనిట్లు అసెంబుల్ చేయగలిగే సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది. 200-500 సీసీపైనే ఫోకస్.. రెండు బ్రాండ్లలోనూ 200-500 సీసీ సామర్థ్యం గల బైక్‌ల విక్రయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు శిరీష్ తెలి పారు. ‘100-125 సీసీ బైక్‌లు నడిపినవారు 250 సీసీకి నేరుగా వెళ్తున్నారు. 150-200 సీసీ బైక్‌లను నడిపినవారు 300 సీసీ ఆపైన సామర్థ్యంగల మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. 250 సీసీ ఆపై సామర్థ్యంగల సూపర్ బైక్‌ల విపణి భారత్‌లో 50% వృద్ధితో 10,000 యూనిట్లుంది. మంచి బ్రాండ్లు, సూపర్‌బైక్‌ల పట్ల పెరుగుతున్న మోజు కారణంగా 2015-16లో ఈ సంఖ్య 15,000 యూనిట్లకు చేరుకుంటుంది’ అని ఆయన వివరించారు.