న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా తన ‘మాన్‌స్టర్ 821’లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.9.51 లక్షలు. కొత్త మాన్‌స్టర్ 821లో యూరో–4 ప్రమాణాలకు అనువైన 821 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది.
‘మాన్‌స్టర్ బైక్స్ గత 25 ఏళ్లుగా వినియోగదారుల ఆదరణను చూరగొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 25వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించాం’ అని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గి కానోవాస్ గారీగా తెలిపారు. తాజా మాన్‌స్టర్ 821 బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించామని, ఈ బైక్స్‌ను జూన్ తొలి వారం నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment