ఈ బైక్ ధర రూ.19.99 లక్షలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ మోటార్ బైక్‌ల తయారీ సంస్థ డుకాటి.. తన సూపర్ బైక్ మల్టిస్ట్రాడ 1260 బైక్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’ పేరుతో విడుదలైన ఈ బైక్ ధర రూ.19.99 లక్షలు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలలోని తమ డీలర్ల వద్ద బైక్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గీ కానోవాస్ మాట్లాడుతూ.. ’ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్ ఇది. ఆఫ్ రోడ్ డ్రైవ్ ఇష్టపడే ఔత్సాహికుల స్పోర్టీ బైక్‌గా ఈ నూతన వేరియంట్‌ను అభివర్ణిస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment