మార్కెట్‌లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్’
ప్రారంభ ధర రూ.9.32 లక్షలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్స్ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా ‘స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్’ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.9.32 లక్షలు(ఎక్స్‌షోరూమ్). యూరో–4 నిబంధనలకు అనువైన 803 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీనితోపాటు స్క్రాంబ్లర్ ఐకాన్, స్క్రాంబ్లర్ క్లాసిక్ బైక్స్‌లో యూరో–4 వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.7.23 లక్షలు, 8.48 లక్షలుగా ఉన్నాయి.