Triumph Speed 400 and Scrambler 400X Launched In India - Sakshi
Sakshi News home page

భారత్‌లో ట్రయంఫ్‌ కొత్త బైక్స్‌..

Published Thu, Jul 6 2023 8:11 AM | Last Updated on Thu, Jul 6 2023 8:31 AM

Triumph Speed 400, SCRAMBLER 400X Launched In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం బైక్స్‌ తయారీలో ఉన్న బ్రిటిష్‌ కంపెనీ ట్రయంఫ్‌ తాజాగా భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ వీటిలో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, ట్రయంఫ్‌ సంయుక్తంగా ఈ రెండు మోడళ్లను అభివృద్ధి చేశాయి. 2017లో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

ఎక్స్‌షోరూంలో ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ధర రూ.2.23 లక్షలు ఉంది. ఈ నెల నుంచే లభిస్తుంది. స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ ధర ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్‌ నుంచి ఈ మోడల్‌ డెలివరీలు ఉంటాయి. పెద్ద ఎత్తున అమ్మకాలను ఆశిస్తున్నట్టు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర పుణే సమీపంలోని చకన్‌ వద్ద ఉన్న కొత్త ప్లాంటులో ఈ బైక్స్‌ తయారు చేస్తామన్నారు. 2024 మార్చి నాటికి 80 నగరాలు, పట్టణాల్లో ట్రయంఫ్‌ వరల్డ్‌ షోరూంలు 100కుపైగా రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement