Launched in India: Price
-
భారత్‌లో ట్రయంఫ్ కొత్త బైక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ తాజాగా భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వీటిలో ఉన్నాయి. బజాజ్ ఆటో, ట్రయంఫ్ సంయుక్తంగా ఈ రెండు మోడళ్లను అభివృద్ధి చేశాయి. 2017లో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎక్స్‌షోరూంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.23 లక్షలు ఉంది. ఈ నెల నుంచే లభిస్తుంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ మోడల్ డెలివరీలు ఉంటాయి. పెద్ద ఎత్తున అమ్మకాలను ఆశిస్తున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర పుణే సమీపంలోని చకన్ వద్ద ఉన్న కొత్త ప్లాంటులో ఈ బైక్స్ తయారు చేస్తామన్నారు. 2024 మార్చి నాటికి 80 నగరాలు, పట్టణాల్లో ట్రయంఫ్ వరల్డ్ షోరూంలు 100కుపైగా రానున్నాయి. -
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్ , బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలుగా సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎలుగా ఐ9’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499. శుక్రవారం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 8 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ తమ డివైస్ ప్రత్యేకతలని కంపెనీ వెల్లడించింది. ఎలుగా ఐ9 ఫీచర్లు 5 అంగుళాల 2.5డీ కర్వ్డ్ హెచ్డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోగట్ 7.0 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం 13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
20ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్
-
20ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్
ముంబై: ప్రముఖ మొబైల్ మేకర్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్స్ తో వస్తున్న వివో వి 5 ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 20 మెగా పిక్సెల్ కెమెరా దీంట్లోని ప్రధాన ఆకర్షణ. ముందస్తు బుకింగ్ కోసం బుధవారం నుంచి 22 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండనున్నట్టు, నవంబరు 26 నుంచి అమ్మకాలు మొదలు కానున్నట్టు కంపెనీ పక్రటించింది. రూ.17,980గా ధరని నిర్ణయించింది. దీంతో పాటుగా వి5 ప్లస్ ను కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. గ్రే, గోల్డ్, అండ్ స్పేస్ గ్రేస్ తీవ్ర వేరియంట్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 20 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని టెక్ పండితులు చెబుతున్నారు. కాగా ఈ డివైస్ లోఫేస్ బ్యూటీ, 6.0 యాప్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ, విత్ ఫన్ టచ్ 2.6 ఓఎస్ దీని అదనపు ప్రత్యేకతలు. వివో వి 5 ఫీచర్స్ మెటల్ యూనీబాడీ డిజైన్, డ్యుయల్ సిమ్, 5.5 హెచ్ డీ డిస్ ప్లే (720x1280ఎంపీ) 20 ఎంపీ సెల్పీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4 జీబీ ర్యాం 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ