
న్యూఢిల్లీ: దిగ్గజ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ట్రయంఫ్.. ‘స్పీడ్ ట్విన్ 2019’ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1200–సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్‌బైక్ ధర రూ.9.46 లక్షలు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. ‘భారత రైడర్స్ కోసం ట్రయంఫ్ లగ్జరీ మోటార్ సైకిళ్ల పరిధి చాలా విస్తృతంగా ఉంది.
మా ఉనికిని చాటుకునేలా అత్యాధునిక సూపర్‌బైక్స్‌ను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయడంపై దృష్టి పెట్టాం’ అన్నారు. ఇక సంస్థ జూలై– జూన్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తుండగా.. ఈ కాలంలో 1,150 నుంచి 1,250 యూనిట్ల వరకు విక్రయించే అవకాశం ఉందని వెల్లడించింది. రూ.5లక్షల బైక్స్ విభాగంలో ఈ కంపెనీకి 16 శాతం మార్కెట్ వాటా ఉంది.