India launch
-
ఐఫోన్ 14: ఐఫోన్ లవర్స్‌కు తీపికబురు
సాక్షి, ముంబై: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు తీపి కబురు అందింది. ఎన్నాళ్లోనుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 13న లాంచ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకార ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 13న లాంచ్ చేయబోతోంది. ప్రీఆర్డర్లు సెప్టెంబర్16 నుండి ప్రారంభమవుతాయని,సెప్టెంబరు 23నాటికి షిప్మెంట్లు ప్రారంభం కానున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆపిల్ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు. ఈ సెప్టెంబరులో ఆపిల్ వాచ్ సిరీస్ 8తో పాటు ఐఫోన్ 14 సిరీస్‌ను, AirPods ప్రోను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే న ఆలుగు వేరియంట్లలో తీసుకురానుంది. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 ధన 100 డాలర్లు ఖరీదైనదిగా ఉండనుందట. అయితే ఆపిల్ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు. కొత్త ఐఫోన్‌ను, ఇతర ఉత్పత్తులను సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరులో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లో లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/nRiKRIZcAT — DuanRui (@duanrui1205) July 8, 2022 -
హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు
దేశియ రోడ్లపై టెస్లాకార్లు రయ్.. రయ్ మంటూ ఎప్పుడు తిరుగుతాయా అని ఎదురు చూస్తున్న అభిమానులకు టెస్లా శుభవార్త చెప్పింది. యూజర్ ఇంటర్ ఫేస్‌లో హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దేశంలో చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఈవీ మార్కెట్ పై కన్నేసిన ఆటోమొబైల్ సంస్థలు ఈవీ వాహనాల్ని తయారు చేసి, భారత్ లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రముఖ ఈవీ వెహికల్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఐలో హిందీ లాంగ్వేజ్ ఇప్పటికే భారత్ లో ఐటీహబ్ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి హెడ్ గా ప్రశాంత్ ఆర్.మీనన్ ను ఎంపిక చేశారు. ప్రశాంత్ మీనన్ సైతం టెస్లా కార్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టెస్లా కార్ యూజర్ ఇంటర్ ఫేస్(UI)లో రష్యన్,గ్రీక్,ఫిన్నిష్ క్రొయేషియన్ లాంగ్వేజ్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దీంతో ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు టెస్లా కారు ఇండియన్రోడ్లపై తిరిగే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో టెస్లా మోడల్ 3 కొద్ది రోజుల క్రితం భారత్‌లో టెస్లా మోడల్ 3 కార్ ట్రయల్స్ నిర్వహించారు.ఈ ట్రయల్స్‌లో రోడ్లపై టెస్లా కార్ల డ్రైవింగ్ సులభంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో టెస్లా మోడల్-3 రెడ్ కలర్ కార్‌ను బెంగళూరులో డెలివరీ చేసింది. భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. టెస్లా మోడల్ -3 అమెరికన్ మార్కెట్లో ప్రారంభ ధర సుమారు రూ .30 లక్షలు ($ 39,990) కు విక్రయిస్తున్నారు. కార్లపై అధిక కస్టమ్స్ సుంకం విధించడం వల్ల, భారత్ కు వచ్చే టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ .70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. -
మార్కెట్లోకి ట్రయంఫ్ ‘స్పీడ్ ట్విన్’
న్యూఢిల్లీ: దిగ్గజ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ట్రయంఫ్.. ‘స్పీడ్ ట్విన్ 2019’ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1200–సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్‌బైక్ ధర రూ.9.46 లక్షలు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. ‘భారత రైడర్స్ కోసం ట్రయంఫ్ లగ్జరీ మోటార్ సైకిళ్ల పరిధి చాలా విస్తృతంగా ఉంది. మా ఉనికిని చాటుకునేలా అత్యాధునిక సూపర్‌బైక్స్‌ను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయడంపై దృష్టి పెట్టాం’ అన్నారు. ఇక సంస్థ జూలై– జూన్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తుండగా.. ఈ కాలంలో 1,150 నుంచి 1,250 యూనిట్ల వరకు విక్రయించే అవకాశం ఉందని వెల్లడించింది. రూ.5లక్షల బైక్స్ విభాగంలో ఈ కంపెనీకి 16 శాతం మార్కెట్ వాటా ఉంది. -
హార్లీ డేవిడ్సన్ న్యూ బైక్స్ ఇవే...
సాక్షి,న్యూఢిల్లీ: హార్లీ డేవిడ్సన్ ఇండియా గురువారం తన 2018 రేంజ్ సాఫ్టెయిల్ మోటార్ సైకిల్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో స్ట్రీట్బాబ్, ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్, హెరిటేజ్ క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ 11.99 లక్షలు, రూ 13.99 లక్షలు, రూ 17.49 లక్షలు, రూ 18.99 లక్షలుగా కంపెనీ పేర్కొంది. నూతన మోడల్స్ బైక్ ఔత్సాహికులకు, రైడర్స్‌కు వినూత్న ఉత్పత్తులు అందించాలన్న స్పృహతో రూపొందించినవని హార్లీ డేవిడ్సన్ ఇండియా, చైనా మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ మెకంజీ పేర్కొన్నారు. ఈ బైక్స్ ఫస్ట్ లుక్కు అద్భుత స్పందన వచ్చిందని, లీజర్ మోటార్‌సైక్లింగ్ క్రీడలో ఇవి మైలురాయిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘రెడ్ మి 4’ కమింగ్ సూన్..ధర ఎంత?
ముంబై: స్మార్ట్ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. అతిచవక ధరలో ఆ స్మార్ట్‌ఫోన్ ను మే 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో అతి ఖరీదైన డివైస్‌లను లాంచ్ చేసిన సంస్థ, రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధరను చౌక ధరలో సుమారు రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్‌లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్త వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది. దీని ధర ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది. షియామి వైస్ ప్రెసిడెంట్, ఎండీ, మను కుమార్ రెడ్మి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోందని ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెలలో ఇదిరెండవ అతిపెద్ద ప్రకటన కానుందంటూ ట్వీట్ చేయడంతో మరిన్ని ఆసక్తి నెలకొంది. రెడ్ మి 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ మి 4 ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెట్ మొమరీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ Announcing the launch of a new Redmi phone! This will be the 2nd BIG announcement of the month ☺️ Coming soon. Stay tuned #PowerInYourHand pic.twitter.com/jvzGCY2oyR — Manu Kumar Jain (@manukumarjain) May 5, 2017 -
అదిరే ఫీచర్లతో ‘ఎల్జీ జీ 6’ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను తీసుకురానుంది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లోవిడుదల చేయబోతుంది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ఏప్రిల్ 24న అందుబాటులోకి తీసుకురానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఇప్పటికే ప్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లాంచింగ్ లైవ్ అప్డేట్ను ప్రత్యేకంగా అందించనుంది. ఎల్జీ జీ 6 ఫీచర్లు 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది.మరోవైపు దీని ధర రూ.49,999 ఉండొచ్చని తెలుస్తోంది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. -
లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా?
ముంబై: చైనీస్ బహుళ జాతి కంపెనీ లెనోవా, తన కొత్త మోడల్ లెనోవా వైబ్ కె 5 ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో 4జీ సౌకర్యంతో ఒకసరికొత్త ఎఫర్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.6,999గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.జూన్ 13 నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది. జూన్ 22 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చేపడతామని పేర్కొంది. ప్రస్తుతానికి కేవలం అమెజాన్‌లో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుంది లెనోవా వైబ్ కె 5 ప్రత్యేకతలు... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 415 ప్రాసెసర్ 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ డ్యూయల్ సిమ్, 4 జీ ఎల్టీఈ, మైక్రో యూఎస్బీ పోర్ట్ 2,750ఎమ్ఏహెచ్ బ్యాటరీ 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్,5 మెగా పిక్సెల్ ముందు కెమెరా ఈ మధ్యాహ్నం 1 గంటనుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యే ఈ వైబ్ కె 5 స్మార్ట్ ఫోన్ గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో లభ్యమవుతోంది.