అదిరే ఫీచర్లతో ‘ఎల్‌జీ జీ 6’ కమింగ్‌ సూన్‌ | LG G6 India launch set for April 24 | Sakshi
Sakshi News home page

అదిరే ఫీచర్లతో ‘ఎల్‌జీ జీ 6’ కమింగ్‌ సూన్‌

Published Thu, Apr 20 2017 2:54 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

అదిరే ఫీచర్లతో ‘ఎల్‌జీ జీ 6’ కమింగ్‌ సూన్‌

అదిరే ఫీచర్లతో ‘ఎల్‌జీ జీ 6’ కమింగ్‌ సూన్‌

న్యూఢిల్లీ: సౌత్‌ కొరియా మొబైల్‌ మేకర్‌ ఎల్‌జీ  మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకురానుంది. ఎల్‌జీ జీ 6 పేరుతో ఈ  స్మార్ట్ ఫోన్ ను  భారత్‌ లోవిడుదల చేయబోతుంది. గత ఫిబ్రవరిలో మొబైల్‌ వరల్ఢ్  కాంగ్రెస్‌ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను   ఏప్రిల్‌ 24న  అందుబాటులోకి తీసుకురానుంది.  డాల్బీ విజన్‌ ఫీచర్‌ తో వస్తున్న  ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్‌ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఇప్పటికే ప్రి రిజిస్ట్రేషన్‌  ప్రక్రియను ప్రారంభించిన   సంస్థ రిజిస్ట్రేషన్‌  చేసుకున్న వారికి  లాంచింగ్‌  లైవ్‌ అప్‌డేట్‌ను ప్రత్యేకంగా అందించనుంది. 
 

ఎల్‌జీ జీ 6 ఫీచర్లు
5.7 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌, డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌
ఫింగర్‌ ప్రింట్‌  స్కానర్‌
2880 x1400  పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
 క్వాల్కామ్‌ ఎంఎస్‌ఎం 8996 స్నాప్‌ డ్రాగన్‌821 ప్రోసెసర్‌
4జీబీ ర్యామ్‌
32జీబీ, 64  ఇంటర్నల్‌  స్టోరేజ్‌, ఎస్‌డీ  కార్డు ద్వారా ఎక్స్‌పాండ్‌ చేసుకునే  అవకాశం
13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్‌  ముందు కెమెరా
 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 కాగా జీ 5కి కొనసాగింపుగా  వస్తున్న జీ6లో అసాధారణంగా   ఫుల్‌  విజన్‌ డిస్‌ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది.మరోవైపు దీని ధర రూ.49,999 ఉండొచ్చని తెలుస్తోంది. మిస్టిక్‌ వూట్‌, అస్ట్రో బ్లాక్‌, ఐస్‌ ప్లాటినం మూడు రంగుల్లో  ఇది లభ్యం కానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement