April 24
-
అదిరే ఫీచర్లతో ‘ఎల్జీ జీ 6’ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను తీసుకురానుంది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లోవిడుదల చేయబోతుంది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ఏప్రిల్ 24న అందుబాటులోకి తీసుకురానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఇప్పటికే ప్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లాంచింగ్ లైవ్ అప్డేట్ను ప్రత్యేకంగా అందించనుంది. ఎల్జీ జీ 6 ఫీచర్లు 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది.మరోవైపు దీని ధర రూ.49,999 ఉండొచ్చని తెలుస్తోంది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. -
ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు!
ఈ నెల 8 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ∙ఐదు దశల్లో నిర్వహణకు బోర్డు చర్యలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్‌ను ఈ నెల 8 నుంచి ప్రారంభించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఐదు దశల్లో జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనుంది. వచ్చే నెల 24న ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 8న సంస్కృతం పేపర్–1, పేపర్–2 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభిస్తామని బోర్డు పేర్కొంది. అలాగే రెండు దశల మూల్యాంకనాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తామని వెల్లడించింది. 16 నుంచి ఇంగ్లిషు పేపర్–1, పేపర్–2, తెలుగు పేపర్–1, 2, హిందీ పేపర్–1, 2, మ్యాథ్స్ పేపర్ 1 (ఏ), 1 (బీ), పేపర్–2 (ఏ), 2(బీ), సివిక్స్ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం చేపడతామని వివరించింది. 21వ తేదీ నుంచి మూడో దశలో ఫిజిక్స్ పేపర్–1 ,2, ఎకనామిక్స్ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నట్లు బోర్డు తెలిపింది. 24 నుంచి నాలుగో దశలో కెమిస్ట్రీ పేపర్–1, 2, హిస్టరీ పేపర్–1, 2 మూల్యాంకనం చేపట్టనుంది. ఐదో దశ మూల్యాంకనాన్ని 27 నుంచి మొదలుపెట్టి కామర్స్ పేపర్–1, 2, బోటనీ పేపర్–1, 2, జువాలజీ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనుంది.