లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా? | Lenovo Vibe K5 launched in India for Rs 6,999 | Sakshi
Sakshi News home page

లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా?

Published Mon, Jun 13 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా?

లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా?

ముంబై: చైనీస్ బహుళ జాతి కంపెనీ లెనోవా, తన కొత్త మోడల్ లెనోవా వైబ్ కె 5 ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో 4జీ   సౌకర్యంతో  ఒకసరికొత్త ఎఫర్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది.  దీని ధర రూ.6,999గా   నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.జూన్ 13 నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది. జూన్ 22 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చేపడతామని పేర్కొంది.  ప్రస్తుతానికి కేవలం అమెజాన్‌లో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుంది
 
లెనోవా వైబ్ కె 5  ప్రత్యేకతలు...
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే
క్వాల్‌ కామ్ స్నాప్ డ్రాగన్ 415 ప్రాసెసర్
720x1280 పిక్సెల్ రిజల్యూషన్
2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
డ్యూయల్ సిమ్, 4 జీ ఎల్టీఈ, మైక్రో యూఎస్బీ పోర్ట్
2,750ఎమ్ఏహెచ్ బ్యాటరీ
13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్,5 మెగా పిక్సెల్ ముందు కెమెరా

ఈ మధ్యాహ్నం 1 గంటనుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యే ఈ వైబ్ కె 5  స్మార్ట్ ఫోన్  గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో లభ్యమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement