ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ స్పోర్ట్ 660 ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్‌లో ధర ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షలు. ఈ మోడల్ రాకతో మధ్యస్థాయి బరువుగల అడ్వెంచర్ బైక్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అయిందని కంపెనీ తెలిపింది. 660 సీసీ ట్రిపుల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 81 పీఎస్ పవర్, 17 లీటర్ల ఇంధన ట్యాంక్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, బ్లూటూత్ రెడీ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్విచేబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి హంగులు ఉన్నాయి.
డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఎయిర్ వెంట్, బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్‌తో స్పోర్టీ లుక్‌ను పొందనుంది. రేడియేటర్ కౌల్‌ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్ మోటార్స్ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్‌గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. ఈ బైక్ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఇది కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి వంటి బైక్లకు పోటీగా నిలవనుంది.
(చదవండి: 2022–23 బడ్జెట్..దూసుకుపోనున్న దేశ ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్!)
Comments
Please login to add a commentAdd a comment