
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు చెక్ పెట్టాలని జీ7 నేతలకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కెనెడా, యూకే, ఫ్రాన్స్ నుంచి మద్దతు లభించింది. అయితే జర్మనీ, ఇటలీ, ఈయూలు బైడెన్ ప్రతిపాదన పట్ల అంతగా సుముఖత చూపలేదు. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాను వేలెత్తిచూపడంపై కూడా తక్షణ ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైడెన్ మాత్రం ఈ అంశాలపై జీ7 దేశాలు ఆదివారం సంయుక్త ప్రకటన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చైనా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌కు పోటీగా బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ద వరల్డ్ పేరిట అభివృద్ది చెందుతున్న దేశాల్లో మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని జీ7 దేశాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. చైనా పట్ల అమెరికా అవలంబిస్తున్న కఠినవైఖరిపై మిత్రదేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఎలాగైనా ఈ సదస్సు నుంచి చైనాకు సందేశం పంపాలని అమెరికా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment