
కార్బిస్‌బే(ఇంగ్లండ్)/బీజింగ్: పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దేశాల అధినేతలు తీర్మానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత వేగంగా పరుగులు పెట్టడానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. జిన్‌జియాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్‌లో మానవ హక్కులను చైనా నాయకత్వం నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోందని మండిపడ్డారు. చైనా దూకుడును కచ్చితంగా అడ్డుకుందామంటూ తీర్మానం చేశారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. బాలికల విద్య, భవిష్యత్తులో మహమ్మారుల నివారణ, ‘మళ్లీ మెరుగైన ప్రపంచం నిర్మాణం’లో భాగంగా ఆఫ్రికాలో రైల్వేలు, ఆసియాలో విండ్ ఫామ్స్‌కు సాయం అందించడం, పునరుత్పా దక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం›వంటి వాటిపై తీర్మానాలు చేశారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment