
న్యూఢిల్లీ : జీ-7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. మంగళారం ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో సంభాషించినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా అమెరికాలో జరిగే తదుపరి జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా మోదీని ట్రంప్ కోరారని తెలిపింది. అలాగే ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి, ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి, భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతోపాటుగా పలు అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా పేర్కొంది.
కాగా, ఇటీవల జీ-7 కూటమిని విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ–10 లేదంటే జీ–11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ–7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment