నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. అడవులు తరిగిపోతుండటంతో మూగ జీవాలు జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. మరోవైపు గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. అంగారక గ్రహంపై ఝురోంగ్ రోవర్ తీసిన ఫొటోలను తాజాగా చైనా విడుదల చేసింది.
1/9
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్ధన్నపేట గ్రామంలో శుక్రవారం మేఘాలు దోబూచులాడుతున్నాయి. నల్లని మబ్బులు దట్టంగా ఉన్న వృక్షాన్ని కప్పి వేయడంతో పగలే చీకటి అలుముకున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
2/9
ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రపు అలలు
3/9
విద్యుదాఘాతానికి ఏడు మూగజీవాలు మృత్యువాత పడిన ఘటన మహబూబాబాద్‌జిల్లా నర్సింహులపేట మండలం చర్లచంద్రు తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షం, గాలి దుమారానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో బావుల కోసం వేసిన విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ విషయం తెలియక శుక్రవారం ఉదయం తండా వాసులు ఎప్పటిలాగే పశువులను మేతకు వదిలారు. అలా వెళ్లిన ఏడు పశువులకు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.
4/9
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చింది. నగరంలోని పరిమళకాలనీలో సుమన్ ఇంటి వద్ద శుక్రవారం ఉదయం సుమారు ఆరడుగుల పొడవైన కొండచిలువ దర్శనమిచ్చింది. దీంతో కాలనీవాసులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కాకతీయ జూపార్క్‌కు చెందిన రెస్క్యూ టీం సభ్యులు కొండచిలువను చాకచక్యంగా బంధించాక జూకు తరలించారు.
5/9
కరోనాతో అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కిషన్‌పురలోని అభయాంజనేయస్వామి ఆలయంలో సామూహిక సామూహిక తిలతర్పణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఐనవోలు ప్రసాద్‌శర్మ – ఉమాదేవి దంపతుల ఆధ్వర్యాన శుక్రవారం రాత్రి 1,008 దీపాలు వెలిగించి ఈ కార్యక్రమం చేపట్టారు.
6/9
ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద శుక్రవారం పెట్రోలింగ్ చేస్తూ సందర్శకులను తీరం నుంచి దూరంగా పంపిస్తున్న పోలీసు
7/9
అంగారక గ్రహంపై చైనా పంపిన ఝురోంగ్ రోవర్ తాజా ఫొటోలివి. గ్రహం ఉపరితలంపై విడిగా ఉంచిన రిమోట్ కెమెరా ఈ రోవర్ ఫొటోలను తీసింది. రోవర్‌కు సంబంధించిన తాజా ఫొటోలను చైనా అంతరిక్ష సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
8/9
కార్న్‌వాల్‌లోని ఫాల్‌మౌత్ బీచ్‌లో జి–7 దేశాధినేతల వేషధారణలో కోవిడ్ టీకా సిరెంజీ కోసం పోటీ పడుతున్న పర్యావరణ కార్యకర్తలు
9/9
ముంబైలోని అంధేరీలో భారీ వర్షాలకు కూలిపోయిన చండీవలి బీఎంసీ ట్రైనింగ్ సెంటర్ రీటెయినింగ్ వాల్
Comments
Please login to add a commentAdd a comment