cia chief
-
చైనా దారుణాలతోనే శ్రీలంకకు ప్రస్తుత దుస్థితి!
వాషింగ్టన్: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పతనానికి చైనానే కారణమని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్ విలియమ్ బర్న్స్ ఆరోపించారు. చైనా పెట్టుబడులపై కొలంబో 'మూగ పందాలు' వేసిందని, అదే విపత్తు పరిస్థితులకు దారి తీసిందన్నారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్‌లో మాట్లాడారు సీఐఏ చీఫ్. ‘చైనీయులు తమ పెట్టుబడుల కోసం ముందు ఆకర్షనీయమైన చర్యలు చేపడతారు. ఆ తర్వాతే అసలు విషయం బయటకు వస్తుంది. చైనా వద్ద భారీగా అప్పులు చేసిన శ్రీలంక పరిస్థితులను ప్రపంచ దేశాలు ఓసారి చూడాలి. వారు తమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై మూగ పందాలు వేశారు. ఇప్పుడు విపత్తు వంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. దాని ద్వారా ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారి తీసింది.’ అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని దేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు సైతం శ్రీలంక పరిస్థితులు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు సీఐఏ చీఫ్. చైనాతో శ్రీలంక ఏ విధంగా వ్యవహరించిందే ఓసారి పరిశీలించాలని సూచించారు. చైనాతో పాటు చాలా దేశాల నుంచి శ్రీలంక అప్పులు చేసిందని గుర్తు చేశారు. 2017లో 1.4 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఓ పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చిందని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో భౌగోళికంగా అమెరికాకు చైనానే ఏకైక సవాలుగా పేర్కొన్నారు. తాహతకు మించి అప్పులు చేస్తున్న దేశాలు శ్రీలంకను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా గత శనివారం హెచ్చరించారు. ఆయా దేశాలకు ఇదొక హెచ్చరికగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్ హెచ్చరిక చేసిన కొద్ది రోజుల్లోనే సీఐఏ చీఫ్ ఈ వాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 1948, స్వాతంత్య్రం సాధించిన తర్వాత శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరైన ఆహారం, ఔషదాలు, వంట గ్యాస్, చమురు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణం.. గొటబయ రాజపక్స స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రణీల్ విక్రమ సింఘే.. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. బుధవారమే విక్రమ సింఘేను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుంది పార్లమెంట్. సింఘేకు 134 ఓట్లు వచ్చాయి. ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన -
తాలిబన్లతో సీఐఏ చీఫ్ రహస్య చర్చలు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత అమెరికాలోని జో బైడెన్ సర్కార్, ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబన్ల మధ్య తొలిసారి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ తాలిబన్లతో రహస్య చర్చలు జరిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడినట్లు మంగళవారం వెల్లడించింది. తాలిబన్లతో కీలక నేతలతో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలుగా భావిస్తున్నారు. తాలిబాన్ నియంత్రణలో ఉన్నఅఫ్గాన్నుండి నుండి వేలాది మంది ప్రజలను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో సీఐఏ చీఫ్ బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా కాగా తాలిబన్ల కీలక నేతలు, కాబూల్‌లో అధికారం చేపట్టిన అగ్ర నాయకుల్లో బరాదర్ ఒకరు కావడం విశేషం. అయితే ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం స్పష్టత లేదు.మ రోవైపు ఈనివేదిలపై వ్యాఖ్యానించేందుకు సీఐఏ ప్రతినిధి నిరాకరించారు. చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! కాగా అఫ్గానిస్తాన్ కాబూల్ విమానాశ్రయంనుంచి సైనిక బలగాల తరలింపు, అమెరివాసుల తరలింపు ప్రక్రియను ఆగస్ట్ 31లోపు ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు అమెరికా, ఇతర మిత్రదేశాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజల తరలింపుపై సమీక్షించేందుకు జీ 7 (బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాలు వర్చువల్ గా సమావేం కానున్నారు. చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
అమెరికాలోనూ ఇస్తాంబుల్ తరహా దాడులు?
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చేసినట్లుగానే అమెరికాలో కూడా దాడులు చేయొచ్చని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెనన్ హెచ్చరించారు. ఐఎస్ సామర్థ్యం ఏంటో పరిశీలించే నిఘా వృత్తిలో ఉన్న వ్యక్తిగా తాను చాలా ఆందోళన చెందుతున్నానని, వాళ్లు వీలైనంత ఎక్కువ మందిని చంపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రధానంతా విదేశాలలోనే దాడులు చేయాలనుకుంటున్నారని బ్రెనన్ తెలిపారు. ఇస్తాంబుల్ తరహాలోనే అమెరికాలో కూడా దాడులు చేయాలని ఐఎస్ ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజానికి ఇస్తాంబుల్‌లో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు 20 రోజుల ముందే హెచ్చరించాయి. ఆ లేఖలో అటాటర్క్ విమానాశ్రయం మీద దాడి జరగొచ్చని కూడా ఉందట. ఇప్పటివరకు ఆ దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోకపోయినా.. ఆత్మాహుతి దాడులు జరిగిన పద్ధతి చూస్తుంటే మాత్రం అది ఐఎస్ వాళ్ల పనేనని బ్రెనన్ అనుమానం వ్యక్తం చేశారు.