
జర్మనీకి గోల్ అందించిన టోనీ క్రూస్‌ను అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు
మాస్కో : ప్రపంచకప్ ఫేవరెట్లలోకెల్లా హాట్ ఫేవరేట్. తొలి మ్యాచ్‌లో సాధారణ జట్టుపై అనుహ్య ఓటమి. ఇకరెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై ఓడిపోతే ఇంటికే.. డ్రా అయినా డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి నాకౌట్ కష్టమే. గ్రూఫ్ ఎఫ్‌లో భాగంగా స్వీడన్‌తో జరిగిన కీలక మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న సమయంలో ఎక్సట్రా ఇంజ్యూరి టైమ్‌లో గోల్ చేసి జర్మనీ ఊపిరిపీల్చుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 74 శాతం బంతి జర్మనీ ఆధీనంలో ఉన్నా గోల్ చేయడంలో ఫార్వర్డ్ ప్లేయర్స్ విఫలమయ్యారు. ఆట ప్రారంభమైన 32వ నిమిషంలో స్వీడన్ ఆటగాడు సెంటర్ బాక్స్ నుంచి లెఫ్ట్ కార్నర్ దిశగా గోల్ చేసి జర్మనీకి షాక్ ఇచ్చాడు. ఇక ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవటంతో 0-1తో ప్రథమార్థం ముగిసింది.
రెండో భాగం ప్రారంభమైన మూడు నిమిషాలకే మార్కో ర్యూస్(48వ నిమిషంలో) జర్మనీకి తొలి గోల్ అందించారు. ఇక మరో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. ఇరు జట్లు అటాకింగ్ గేమ్ ఆడిని రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకోవడంతో మరో గోల్ నమోదుకాలేదు. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్ ప్రారంభమైన నాలుగు నిమిషాలకు కూడా గోల్ కాకపోవడంతో మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న తరుణంలో ఫ్రీకిక్ రూపంలో జర్మనీని అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న టోనీ క్రూస్ (90+5 నిమిషంలో) జర్మనీ ఖాతాలో మరో గోల్ చేర్చి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో జర్మనీ డిఫెండర్ జెరోమ్ బోటెన్‌గ్‌కు రిఫరీలు రెండు సార్లు ఎల్లో కార్డు చూపించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జర్మనీ 10 అనవసర తప్పిదాలు చేయగా, స్వీడన్ 11 తప్పిదాలు చేసింది. ప్రపంచకప్‌లో ప్రథమార్థంలో ప్రత్యర్థి గోల్ చేసి, తాను గోల్ చేయకుండా జర్మనీ గెలవటం 1974 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు కూడా స్వీడన్‌పైనే కావడం గమనార్హం. జర్మనీ జట్టు ప్రపంచకప్ చరిత్రలో చివరి నిమిషంలో గోల్ చేసి గెలవడం ఇదే తొలిసారి