బెర్లిన్ : విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్‌లో సమావేశం కానున్నారు. ఆరురోజుల పర్యటనలో భాగంగా మోదీ నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటన సాగనుంది. ఆర్థిక పరమైన సహకారం, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూక్లియర్, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆయా దేశాలతో మోదీ పరస్పర చర్చలు జరుపుతారు.
దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని స్పెయిన్‌లో పర్యటించడం ఇదే ప్రథమం ఈ పర్యటనలో భాగంగా మోదీ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మెక్రాన్‌తో భేటీ కానున్నారు. మోదీతో పాటు మంత్రులు హర్షవర్థన్, పియూష్ గోయిల్, నిర్మలా సీతారామన్‌తో పాటు ఎంజే అక్బర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు.