ఫ్రాంక్‌ఫర్ట్: కరోనా వైరస్ ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగానూ ప్రాణాలను బలిగొంటోంది. కరోనా కాటుకు ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కావడంతో దాన్ని ఎలా ఎదుర్కొవాలో అర్థం కాక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన శనివారం రైలు పట్టాలపై నిర్జీవంగా కనిపించారు. జర్మనీ వాణిజ్య రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్ నగరం హెస్సీ రాష్ట్రంలోనే ఉంది. దేశంలో ప్రముఖ బ్యాంకుల కేంద్ర స్థానం ఈ నగరమే. కరోనా వల్ల హెస్సీలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. షాఫర్ పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి సేవలందిస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత భయానకంగా ఉండబోతోందని భావించి, తనువు చాలించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment