విమానాన్ని పెళ్లాడుతున్న మహిళ! | Germany Woman Planning To Marry Boeing 737 Jet Plane This Year | Sakshi
Sakshi News home page

‘దాన్ని చూడగానే ప్రేమలో పడ్డాను’

Published Mon, Jan 27 2020 11:17 AM | Last Updated on Mon, Jan 27 2020 2:39 PM

Germany Woman Planning To Marry Boeing 737 Jet Plane This Year - Sakshi

ప్రేమకు హద్దులు ఉండవంటారు. ఇక ఓ అమ్మాయి ప్రేమలో పడిందంటే ఏ హ్యాండ్సమ్‌ కుర్రాడో, లేక చిన్ననాటి మిత్రుడు అయ్యింటాడులే అనుకుంటారు. అయితే ఇక్కడ వింతగా జర్మనీకి చెందిన ఓ మహిళా విమానంతో ప్రేమలో పడిందంట. అంతేకాదు ఆ విమానాన్ని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రకటించి ప్రేమకు హద్దులు లేవని నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌కు చెందిన మైకేల్‌ కోబ్కే(30) ఆరేళ్లుగా ప్రాణపదంగా ప్రేమిస్తున్న తన కలల జెట్‌ బోయింగ్‌ 737 ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్‌లో పెళ్లాడుతున్నట్లు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘2014లో బెర్లిన్‌ టెగెల్‌ ఎయిర్‌పోర్టులో ఈ జెట్‌ విమానాన్ని మొదటిసారి చుశాను. చూడగానే ప్రేమలో పడ్డాను. దీనికి ‘స్కాట్జ్ (డార్లింగ్‌)’ అనే ముద్దు పేరును కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

‘గత ఆరేళ్లుగా ఈ విమానంతో డేటింగ్‌ చేస్తున్నా. దీన్ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను. 2014లో టెగెల్‌ ఎయిర్‌పోర్టు ఈ జేట్‌ బోయింగ్‌ విగ్స్‌, వింగ్లేట్స్‌, థ్రస్టర్‌లు చూడగానే ఆకర్షితురాలినయ్యాను. ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ ఈ జెట్‌ను కేవలం కిటికి దగ్గరి నుంచే కలుసుకునే దాన్ని. అలా ఆరేళ్లుగా ఈ విమానంతో ప్రేమలో ఉన్నాను’  అని మైకేల్‌ పేర్కొంది. 2019 సెప్టెంబర్‌లో ఈ 40 టన్నుల జెట్‌ను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నానని కూడా వెల్లడించింది. అంతేగాక ‘దీనితో ఉన్నంత సేపు నాకు సమయం తెలీదు. ఈ విమానం వింగ్‌పై నిలబడి దాన్ని ముద్దాడిన క్షణాన్ని చాలా ఆనందించాను. నా జీవితంతో అదో అందమైన క్షణం​’ అని విమానంతో తనకున్నా బంధాన్నిచెప్పుకొచ్చింది. ఇక మెకేల్‌ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు కూడా స్వాగతించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement