శంషాబాద్ (రంగారెడ్డి): విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో గుమ్మడి వెంకటేశ్వరరావు అనే ప్రయాణికుడికి, ప్రయాణికురాలికి మధ్య ఈ విషయంలో తీవ్ర వాగ్వివాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విమానాశ్రయంలో దిగిన తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.