Shocking: Maskless Woman Attack On 80 Years Old Man In Flight, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: విమానంలో వృద్దుడిపై మహిళ అమానుష దాడి

Published Tue, Dec 28 2021 9:36 PM | Last Updated on Wed, Dec 29 2021 3:30 PM

Woman Attacking 80 Year Old Man For Eating Without Mask In Plane - Sakshi

ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మాస్క్‌ ధరించకుండా బయటకు వస్తే ఊరుకోవడం లేదు. ఆఖరికి తమ స్నేహితులను, బంధువులను సైతం మాస్క్‌ ధరించకపోతే  ఊరుకోవటం లేదు. ఎవరికివారుగా స్వచ్ఛందంగా ఇలా సురకక్షితంగా ఉండటం మంచిదే గానీ అది సృతి మించితే ఇతరులకు, మన తోటివారికి కూడా ఇబ్బందే. అచ్చం అలానే ఒక మహిళ తింటున్నప్పుడూ మాస్‌ ఎందుకు ధరించవంటూ ఒక వృద్దుడిపై  దాడి చేసింది. 

(చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!)

అసలు విషయంలోకెళ్లితే...డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్‌ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. పైగా చాలా అమానుషంగా తిట్టడం వంటివి చేసింది. అయితే నిజానికి ఆమె  మాస్క్‌ ధరించకుండా వృద్దుడుని తిట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్లందరికీ. పైగా వాళ్లంతా కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొడుతుంది. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు.

ఆ తర్వాత ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావు అంటాడు. ఈమేరకు ఆ విమానం అట్లాంటాలో ల్యాండ్‌ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్‌వాల్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత విమానయాన సంస్థలు ఇలాంటి వికృత ప్రవర్తనను సహించేది లేదని ప్రకటించడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement