delta airlines
-
రన్‌వేపై విమానం బోల్తా
టొరంటో: కెనడాలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది! మంచు తుపాను, బలమైన గాలుల ధాటికి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 80 మంది అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 18 మంది గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులోంచి ప్రయాణికులు సురక్షితంగా బయట కొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురగ స్ప్రే చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం...వాతావరణ ఇబ్బందులతో పియర్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బుధ, ఆదివారాల్లో రెండు తుపాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనైతే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం.ప్రాణాలతో ఎలా బయటపడ్డరంటే?విమానం పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితరాలే టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాలు తలకిందులవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డా ప్రయాణికులు మాత్రం స్థిరంగా ఉండేలా, వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందిస్తారు.అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీటు బెల్టులు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులయితే రెక్కలు, తోకభాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. ఇలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. సాధారణ సమయాల్లో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే అయినా ఇలాంటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనం. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందించారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.సైజూ కలిసొచ్చింది...ప్రమాదానికి గురైన బొంబార్డియర్ సీఆర్జే 900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రా ణాలతో బయట పడేందుకు ఇది కూడా కారణమే. కేబిన్ ఎత్తు కేవలం ఆరడుగులే. దాంతో బోల్తా పడ్డా ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు. -
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్‌బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు.నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘కోకో కోలా’ సానుకూల స్పందన అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్‌తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు. -
విమానంలో వృద్దుడిపై మహిళ అమానుష దాడి
ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ఊరుకోవడం లేదు. ఆఖరికి తమ స్నేహితులను, బంధువులను సైతం మాస్క్ ధరించకపోతే ఊరుకోవటం లేదు. ఎవరికివారుగా స్వచ్ఛందంగా ఇలా సురకక్షితంగా ఉండటం మంచిదే గానీ అది సృతి మించితే ఇతరులకు, మన తోటివారికి కూడా ఇబ్బందే. అచ్చం అలానే ఒక మహిళ తింటున్నప్పుడూ మాస్ ఎందుకు ధరించవంటూ ఒక వృద్దుడిపై దాడి చేసింది. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. పైగా చాలా అమానుషంగా తిట్టడం వంటివి చేసింది. అయితే నిజానికి ఆమె మాస్క్ ధరించకుండా వృద్దుడుని తిట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్లందరికీ. పైగా వాళ్లంతా కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొడుతుంది. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావు అంటాడు. ఈమేరకు ఆ విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్‌వాల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత విమానయాన సంస్థలు ఇలాంటి వికృత ప్రవర్తనను సహించేది లేదని ప్రకటించడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) -
కరోనా : ఆ 99మందిని వారి స్వదేశానికి తరలించారు
సాక్షి, హైదరాబాద్ : కరనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్ జాతీయులను మంగళవారం వారి సొంత దేశానికి తరలించారు. ముందుగా ముంబై నుంచి వచ్చిన ఎ320 ఎయిర్‌బస్ విమానంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారందరిని మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో ముంబైకి తరలించారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15గంటల ప్రాంతంలో వారంతా అమెరికాకు బయలుదేరారు. కాగా యుఎస్ కాన్సులేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న 99మందిని మధ్యాహ్నం 1 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. అనంతరం వారందరికి అప్పటికే పూర్తిగా సానిటైజ్ చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాన టెర్మినల్ బిల్డింగ్‌లో ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారందరిని ఎ320 ఎయిర్‌బస్ విమానంలో తరలించారు. కాగా మార్చి 31న ఇదే విధంగా 38 మంది జర్మన్ దేశీయులను ఇండిగో ఫ్లైట్‌లో వారి స్వదేశానికి తరలించారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. (తెలంగాణలో 404కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు) -
'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది'
ఆస్టిన్ : ఆస్టిన్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లడానికి పాట్రిక్ కాసిడీ అనే వ్యక్తి బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్ ఎక్కాడు. కాసిడీ తన సీటులో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఇంతలో తన ముందు సీటులో కూర్చున్న వ్యక్తి నిద్రపోవడానికి తన సీటును వెనక్కు వాల్చాడు. దాంతో ల్యాప్‌టాప్ మీద సీటు బరువు పడడంతో కంప్రెస్ అయి స్ర్కీన్ పగిలిపోయింది. అయితే తన ల్యాప్‌టాప్ అలా అవడానికి కారణమైన వ్యక్తిని ఏం అనకుండా కాసిడీ ఆ విషయాన్ని డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ట్విటర్లో షేర్ చేశాడు. @Delta small note for the suggestion box, maybe have a little warning sign or someway to prevent my laptop from being destroyed when the person in front of me reclines their seat. pic.twitter.com/QHmphXiDhH — Pat Cassidy (@HardFactorPat) February 26, 2020 ' @డెల్టా ఎయిర్‌లైన్స్.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తన సీటును వెనక్కి వాల్చే ముందు తగిన హెచ్చరికలు బోర్డులు పెడితే బాగుండేది. మీరు అలా పెట్టకపోవడం వల్లే నా ల్యాప్‌టాప్ ద్వంసమైంది' అని పేర్కొన్నాడు. దీంతో పాటు ల్యాప్‌టాప్ ఫోటోను కూడా వారికి షేర్ చేశాడు. అయితే ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది. కాసిడి ఫిర్యాదు మేరకు అతని వస్తువుకు భంగం కలిగించినందుకు మా విమానంలో ఎప్పుడైనా సరే 7500 మైళ్లు ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది. అయితే కాసిడీ రీట్వీట్ చేస్తూ..' నాకు 7500 మైళ్లు ఉచిత ప్రయాణం ఆఫర్ చేయడం బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ ఒక ఆరేళ్ల పిల్లాడికి ఇచ్చుంటే ఎగిరి గంతేసేవాడు' అని పేర్కొన్నాడు. అయితే కాసిడి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ల్యాప్‌టాప్ ధ్వంసం కావడానికి ఒక వ్యక్తి కారణమైతే డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించడం ఏంటని....డెల్టా ఎయిర్‌లైన్స్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే బాగుండేదని కొందరు పేర్కొనగా... మరి కొందరు మాత్రం పాట్రిక్‌కు మద్దతుగా నిలిచారు. Update: @Delta is giving me the equivalent of a $75 gift card and an explanation that you would give a six year old. Cool. pic.twitter.com/etGLUXOOjs — Pat Cassidy (@HardFactorPat) February 29, 2020 -
ఎయిర్‌హోస్టెస్ చేసిన పనికి ప్రశంసలు
వికలాంగులు అంటే మనలో చాలా మందికి ఎంతో చిన్న చూపు. వారికి సాయం చేయాల్సింది పోయి చీదరించుకుంటారు చాలా మంది. ఇక ప్రయాణాల్లో అయితే వేరే చెప్పక్కర్లేదు. సాయం చేయకపోగా సూటి పోటీ మాటలంటూ వారిని బాధపెట్టేవారిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఓ వికలాంగురాలి పట్ల ఓ ఎయిర్‌హోస్టెస్ చూపించిన కేర్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంది. ఈ సంఘటన డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్ విమానంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆష్లే అనే యువతి ఎండీవర్ విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు వినికిడి లోపం ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్ జన్నా, ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో.. ఓ కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసిచ్చింది. ‘దానిలో హాయ్ ఆష్లే.. ఈ రోజు నేను ఈ ఫ్లైట్ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్ బటన్‌ను ప్రెస్ చేయ్. నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు. మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. దీన్ని ఆష్లే తల్లి తన ట్విటర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. జన్నా మంచిమనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. My daughter who is Deaf took a flight by herself ! The attendant handed her this note on the plane ! Delta makes it amazing! @Delta pic.twitter.com/KQGVBq9uVC — bostonober (@oberlynn13) July 6, 2019 -
విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో
వాషింగ్టన్: ఎక్కడైనా పాత ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీళ్లు కారడం గురించి వింటుంటాం. ఎప్పుడో ఒకసారి గానీ బస్సుల్లో మనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వదు. కానీ ఏకంగా విమానంలో ప్రయాణికులు మొత్తం జర్నీ సమయంలో నీళ్లు కారి మీద పడుతుండగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. గత శుక్రవారం ఉదయం అట్లాంటా నుంచి ఫ్లోరిడాకు వెళ్లిన డెల్టా ఎయిర్ లైన్స్ ప్రయాణికులు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తతంగాన్ని ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. టామ్ మెక్కల్లాఫ్ అనే ప్రయాణికుడు కుటుంబంతో సహా డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. అయితే రెండు మేగజైన్ల సాయంతో తండ్రి టామ్ తడవకుండా ప్రయాణమంతా ఎలా ఇక్కట్లు ఎదుర్కొన్నాడో ఓ వీడియోను అతడి కుమారుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 'మా నాన్న డెల్టా ఎయిర్‌లైన్స్‌లో వాటర్ గేమ్ ఆడుకున్నాడు. గంటన్నరకు పైగా చేసిన ఈ మొత్తం జర్నీలో ఆయన ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని' టామీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఎయిర్ లైన్స్ అట్లాంటాలో బయలుదేరక ముందే విమాన సిబ్బందికి ఈ సమస్య తెలిసినా పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ లీక్ కారణంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని భయభ్రాంతులకు లోనైనట్లు ప్రయాణికులు తెలిపారు. 1800 డాలర్లు ఖర్చుపెట్టి ప్రయాణిస్తే ప్యాసింజర్లకు ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తారా అని బాధిత ప్రయాణికుడు మెక్కల్లాఫ్ ప్రశ్నించారు. మార్చేందుకు ఇతర సీట్లు ఖాళీ లేవని చెప్పిన సిబ్బంది, ఫ్లోరిడాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత జరిగిన తప్పిదానికి పరిహారంగా కేవలం 100 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశారని బాధితుడు వెల్లడించారు. తాను రెండు మేగజైన్లను అడ్డుగా పెట్టుకుని తనపై పడుతున్న నీటిని పక్కకు దారి మళ్లించానని చెప్పారు. తనతోపాటు మరో ఆరుగురు ప్రయాణికులు జర్నీ మొత్తంగా ఈ పాట్లు పడ్డారని, డెల్టా ఎయిర్‌లైన్స్ మాత్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ వాపోయారు. -
విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో
-
ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై విద్వేషపు దాడి
మసాచూసెట్స్: అమెరికాలో మరోమారు జాతి విద్వేషం బుసలు కొట్టింది. విదేశాలకు యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వస్తూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ముస్లిం ఉద్యోగినిపై చేయి చేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోబిన్ రోడ్స్(57) ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. మసాచూసెట్స్ వెళ్లడానికి కనెక్టింగ్ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లాడు. ఎయిర్‌లైన్స్ క్యాబిన్లో ముస్లిం ఉద్యోగిని ఉండటం చూసి ఉద్రేకం తెచ్చుకున్న రోడ్స్ నువ్వు నిద్రపోతున్నావా? లేదా నమాజ్ చేస్తున్నావా?. ఏం చేస్తున్నావ్? అంటూ గద్దించాడు. ఆ తర్వాత ఉద్యోగిని క్యాబిన్లోకి ప్రవేశించేందుకు అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టాడు. రోడ్స్ ప్రవర్తనతో షాక్ గురైన ఉద్యోగిని భయంతో తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన రోడ్స్ తప్పేం లేకపోయిన వదలనని వ్యాఖ్యానించాడు. దీంతో ఉద్యోగిని అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా రోడ్స్ అడ్డుకున్నాడు. ఘటనను మొత్తం చూస్తున్న ఓ వ్యక్తి రోడ్స్ దృష్టిని మరలించగా ఉద్యోగిని వెంటనే బయటకు పరుగెత్తింది. తేరుకున్న రోడ్స్ ఉద్యోగినిని వెంబడించి ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడితో ఆగని రోడ్స్ ఇస్లాం, ఐసిస్ అంటూ పెద్దగా అరుస్తూ ప్రస్తుతం ఇక్కడ ట్రంప్ ఉన్నాడంటూ నినాదాలు చేశాడు. ముస్లింలను ట్రంప్ వెళ్లగొడతారని వ్యాఖ్యానించాడు. కాగా, రోడ్స్‌ను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 50 వేల డాలర్ల పూచీకత్తుతో కోర్టు అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రోడ్స్‌కు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
యూట్యూబ్ స్టార్‌కు చేదు అనుభవం!
వాషింగ్టన్: యూట్యూబ్ స్టార్‌కు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో స్థిరపడ్డ యెమెన్ వాసి అడమ్ సాలేను అరబిక్‌లో మాట్లాడినందుకు డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేసింది. దీనిపై అతడు తన అసహనాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బుధవారం ఉదయం లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. విమానంలో కూర్చున్న అడమ్ సాలే ఫోన్లో తన తల్లి, ఫ్రెండ్స్‌తో అరబిక్ భాషలో మాట్లాడాడు. తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి విమానం దిగాల్సిందిగా తనను కోరినట్లు వీడియోలో తెలిపాడు. కారణం అడిగితే తాను ఏదో అర్థంకాని భాషలో మాట్లాడానని, దానివల్ల వారికి అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఫిర్యాదు చేశారని ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపారు. జాత్యహంకారంతోనే తనను అవమానించారని సాలే అవేదనం వ్యక్తంచేశాడు. ఇప్పటికే యూట్యూబ్ లో 2.2 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న సాలే ఇందుకు సంబంధించిన తతంగాన్ని వీడియో తీసి.. #BoycottDelta అనే ట్యాగ్ తో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఒక్కరోజులోనే ఈ వీడియో తో ఉన్న ట్వీట్ 2 లక్షల మంది రీట్వీట్ చేశారు. ఎయిర్ లైన్స్ అధికారులను సంప్రదించగా.. 20 మంది ప్యాసెంజర్స్ అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఫిర్యాదు చేసిన కారణంగా ఇద్దరు వ్యక్తులను ఫ్లైట్ నుంచి దించివేసినట్లు వివరణ ఇచ్చారు. ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
విమానంలోంచి ఈడ్చి పడేశారు..
-
విమానంలోంచి ఈడ్చి పడేశారు..
మిచిగాన్: బోర్డింగ్ నియమాలు పాటించలేదని ఓ మహిళను అధికారులు విమానంలో నుంచి ఈడ్చిపారేశారు. ఈ ఘటన మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ సిద్ధంగా ఉన్న సమయంలో మహిళ(పేరు చెప్పలేదు) నియమాలను ఉల్లంఘిస్తూ.. సిబ్బంది చెప్పినా వినకుండా విమానంలోకి ప్రవేశించినట్లు చెప్పింది. టెర్మినల్ గేటు వద్ద బ్యాగేజి చెకింగ్, బోర్డింగ్ వద్ద అధికారుల మాటలను పట్టించుకోలేదని పేర్కొంది. విమానంలో కూర్చున మహిళను ఎయిర్ పోర్టు అధికారులు ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెను అధికారుల అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
ఒక్కసారిగా కంప్యూటర్లు ఆగిపోవడంతో..!
న్యూయార్క్: డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ సోమవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంపెనీ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో డెల్టా విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకొని అవస్థలు పడ్డారు. అమెరికా అంతటా ఉన్న విమానాశ్రయాలతోపాటు, లండన్‌లోని విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాలు ఆగిపోయి తాము పడుతున్న అవస్థలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. మరోవైపు డెల్టా కంపెనీ తన ట్విట్టర్ పేజీలో వివరణ ఇచ్చింది. తమ కంపెనీ సిస్టమ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు ఆగిపోయాయని, త్వరలోనే ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నామని ట్వీట్ చేసింది. -
అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్
అమెరికాలో.. మెక్సికో నుంచి అట్లాంటాకు బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. విమానంలోని ఏసీలో సమస్యలు తలెత్తడంతో దాన్ని వెంటనే దించేశారు. ఏసీ పనిచేయకపోవడంతో.. ఆరుగురు ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఎవరికీ వైద్య చికిత్సలు మాత్రం అవసరం పడలేదు. విమానం రన్‌వే మీద దిగగానే ఎయిర్‌పోర్టులో ఉన్న పబ్లిక్ సేఫ్టీ డివిజన్, అగ్నిమాపక దళం, ఎమర్జెన్సీ వైద్య బృందం దాని వద్దకు వెళ్లారని, ప్రయాణికులను విమానం లోంచి ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాలకు తరలించారని చెప్పారు. విమానంలో 71 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. రెండు గంటల తర్వాత ఎయిర్ కండిషన్ సమస్యను సిబ్బంది సరిచేసి, విమానాన్ని మళ్లీ పంపారు. -
మంటలొచ్చాయని.. విమానం ఖాళీ
జమైకాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో కార్గో విభాగంలో మంటలు చెలరేగినట్లు అలారం రావడంతో.. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను, ఆరుగురు సిబ్బందిని ఆగమేఘాల మీద కిందకు దించేశారు. విమానాన్ని రన్‌వే మీదే వదిలేశారు. ఎయిర్‌పోర్టును కూడా కొద్దిసేపు మూసేశారు. మాంటెగో బే నుంచి అట్లాంటా వెళ్లాల్సిన ఈ బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకోడానికి కొద్ది సేపటి ముందు ఈ హడావుడి జరిగింది. అయితే, నిజానికి ఫ్లైట్ డెక్ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక సరైనది కాదని, అసలు ఎలాంటి మంటలు అందులో చెలరేగలేదని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతకుముందే ప్రయాణికులంతా హడావుడిగా విమానం నుంచి కిందకు దిగిపోయారు. దాంతో విమానాన్ని రన్‌వే మీదే వదిలేశారు. ఈ ఘటన తర్వాత జమైకా విమానాశ్రయాన్ని కూడా కొద్దిసేపు మూసి ఉంచాల్సి వచ్చింది. ఆ మార్గం మీదుగా వెళ్లాల్సిన విమానాలను కింగ్స్టన్ మీదుగా మళ్లించారు. కార్గో బే నుంచి అసలు మంటలు ఉన్నట్లు హెచ్చరికలు రావడానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.