అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్ | Delta Air Lines flight makes emergency landing in Texas | Sakshi
Sakshi News home page

అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్

Published Thu, Dec 24 2015 2:54 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్ - Sakshi

అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్

అమెరికాలో.. మెక్సికో నుంచి అట్లాంటాకు బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. విమానంలోని ఏసీలో సమస్యలు తలెత్తడంతో దాన్ని వెంటనే దించేశారు. ఏసీ పనిచేయకపోవడంతో.. ఆరుగురు ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే ఎవరికీ వైద్య చికిత్సలు మాత్రం అవసరం పడలేదు. విమానం రన్‌వే మీద దిగగానే ఎయిర్‌పోర్టులో ఉన్న పబ్లిక్ సేఫ్టీ డివిజన్, అగ్నిమాపక దళం, ఎమర్జెన్సీ వైద్య బృందం దాని వద్దకు వెళ్లారని, ప్రయాణికులను విమానం లోంచి ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాలకు తరలించారని చెప్పారు. విమానంలో 71 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. రెండు గంటల తర్వాత ఎయిర్ కండిషన్ సమస్యను సిబ్బంది సరిచేసి, విమానాన్ని మళ్లీ పంపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement