బోర్డింగ్ నియమాలు పాటించలేదని ఓ మహిళను అధికారులు విమానంలో నుంచి ఈడ్చిపారేశారు. ఈ ఘటన మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ సిద్ధంగా ఉన్న సమయంలో మహిళ(పేరు చెప్పలేదు) నియమాలను ఉల్లంఘిస్తూ.. సిబ్బంది చెప్పినా వినకుండా విమానంలోకి ప్రవేశించినట్లు చెప్పింది.